పాకిస్థాన్(Pakistan)లో మళ్లీ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా 11 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది.ఇక వివరాల్లోకి వెళ్తే.. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు సమీపంలో కుర్రం జిల్లాలో పాక్(Pakistan) సైన్యం కాన్వయ్‌పై మిలిటెంట్లు ఈ దాడులు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం అక్కడి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
Karur stampede: కరూర్ తొక్కిసలాట .. స్పందించిన రిషబ్ శెట్టి

ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు
కానీ ఈ దాడులకు సంబంధించి ఇప్పటిదాకా పాక్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. అయితే తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటన చేసినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు నుంచి టీటీపీ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా ఆ దేశ భద్రతా సిబ్బంది, ప్రజలే టార్గెట్ ఈ గ్రూప్ ఇంతకుముందు కూడా పలుమార్లు దాడులకు పాల్పడింది.
పాకిస్తాన్ ఎక్కడ ఉంది?
పాకిస్థాన్ ఆసియా ఖండంలోని ఒక దేశం. ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా, తూర్పున భారతదేశం మరియు పశ్చిమాన ఇరాన్ ఉన్నాయి. పాకిస్థాన్‌కు దక్షిణంగా అరేబియా సముద్రం ఉంది. సరిహద్దులు చరిత్రలో పాకిస్తాన్ మరియు దాని పొరుగు దేశాలచే వివాదాస్పదంగా ఉన్నాయి.
1960 లో పాకిస్తాన్లో ఏమి జరిగింది?
సెప్టెంబర్ 19 – ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్ మరియు భారతదేశం సింధు జలాల ఒప్పందంపై సంతకం చేశాయి. సెప్టెంబర్ 28 – ఆఫ్ఘన్ అక్రమంగా బజౌర్ జిల్లాలోకి సరిహద్దు దాటి బజౌర్ ప్రచారాన్ని ప్రారంభించారని విదేశాంగ మంత్రి మంజుర్ ఖాదిర్ ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: