తమిళనాడులో కరూర్‌లో జరిగిన తొక్కిసలాట (Karur stampede) ఘటన పై తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) కూడా దీనిపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ ఘటనను “తీవ్రంగా బాధించేదిగా” అభివర్ణించారు.ఈ దుర్ఘటన ఒకరి తప్పిదం వల్ల జరగదని, ఇది సమష్టి వైఫల్యమే అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు.
KL Rahul: కాంతార చాఫ్టర్ 1 పై కేఎల్ రాహుల్ ప్రశంసలు
కరూర్ ఘటనపై స్పందించడానికి తనకు మాటలు రావడం లేదని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరమని ఆయన అన్నారు. అందరూ ఒకేసారి రావడం వల్ల అభిమానులను లేదా పార్టీ కార్యకర్తలను (Party Members) నియంత్రించడంలో లోపం జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రమాదాలు జరగవని ఆయన వ్యాఖ్యానించారు. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించడం చాలా సులభమని, కానీ జనసమూహాన్ని నియంత్రించడంలో చాలా ఇబ్బందులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ప్రచార ర్యాలీ విషాదాన్ని మిగిల్చిన విషయం
సినిమా ప్రియులు నటీనటులను ఆరాధిస్తారని, గుడులు కూడా కడతారని గుర్తుచేశారు. అగ్ర హీరోల చిత్రాలు విడుదలైన సమయంలో పాలాభిషేకాలు చేయడం కూడా చూస్తుంటామని తెలిపారు.
గతనెల 27న కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: