తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల అధికారుల తనిఖీలు ఐటి సోదాల IT Raids కలకలం సచివాలయం : రాష్ట్ర వ్యాప్తంగా మరో పెద్ద పప్పుల దందా వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.300కోట్ల విలువైన పప్పుల వ్యాపారంలో బారీ అవకతవకలు అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఆదాయపు పన్ను మంగళవారం తెల్లవారు జామునే సోదాలు ప్రారంభించింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట ్నం, కర్నూలు, హైదరాబాద్ Hyderabad నగరాల్లో ఒకేసారి సోదాలు జరిగాయి. పప్పుల సరఫరా పేరుతో ప్రభుత్వ నిధులను మలచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఐటి శాఖాధికారులు రాష్ట్రంలోని 25 ప్రదేశాల్లో సోదాలు జరిపారు. విశాఖలో హిందూ స్తాన్ ట్రేడర్స్, కర్నూల్లో వికేర్ గ్రూప్, గుంటూరులో Guntur మరికొన్ని ప్రముఖ పప్పు ట్రేడింగ్ కంపెనీలు దర్యాప్తు కిందకొచ్చాయి. ఒకేసారి పలు బృందాలు పనిచేయడంతో వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం నెలకొంది.
YS Jagan: హెలికాప్టర్లో మాత్రమే జగన్ కు అనుమతి!

IT Raids
గత ప్రభుత్వ హాయాంలో సివిల్ సప్లయిస్ శాఖ నుంచి టెండర్లు పొంది పెద్దమొత్తంలో పప్పులు సరఫరా చేశామని చూపించి వందల కోట్లు బిల్లు వేసుకున్నట్లు తెలిసింది. చెల్లింపులు అయిన తర్వాత పప్పులు అందించడం కొన్ని చోట్ల సరఫరానే నిలిపి వేయడం వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో భారీ క్యాష్ ఉపసంహరణలు దర్యాప్తులో ఐటి అధికారులు 2024 ఎన్నికల ముందు పెద్ద మొత్తం నగదు ఉపసంహరణలు జరిగినట్లు గుర్తించారు. ఈ లావాదేవీల వెనుక రాజకీయ సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఐటి వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఐటి దాడుల తర్వాత సివిల్ సప్లైస్ శాఖలోనూ చురుగ్గా కదలికలు ప్రారంభమయ్యాయి. ఏఏ టెండర్లు ఎవరికిచ్చారు? చెల్లింపులు ఎప్పుడు జరిగాయి. ? అనే వివరాలను అధికారులు తేలుస్తున్నారు.
రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ దాడులతో రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎవరి అనుమతితో ఈ టెండర్లు కుదిరాయి? ఎవరి మార్గదర్శకత్వంలో చెల్లింపులు జరిగాయి అనేప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పలు కంపెనీలు పన్ను ఎగవేత, బోగస్ సరఫరా, హవాలా లావాదే వీల్లో నిమగ్నమైనట్లు ఆధారాలు లభించాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ ఎందుకు సోదాలు జరిపింది?
రూ.300 కోట్ల విలువైన పప్పుల వ్యాపారంలో అవకతవకలు, అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో ఐటీ శాఖ రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టింది.
ఐటీ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు?
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, హైదరాబాద్ నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: