10 నుంచి రచ్చబండ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీ పోరు ఉధృతం పార్టీ నేతలతో మాజీ సిఎం జగన్ YS Jagan సమావేశంలో కీలక నిర్ణయం విజయవాడ : రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విధానా లకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తామని వైఎస్సార్సీ అగ్రనేత, మాజీ సిఎం జగన్ వెల్లడిం చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. మంగళ వారం తాడేపల్లిలోని Tadepalli పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్సార్సీ అధినేత జగన్ సందర్శించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవం బర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ చేయనున్నట్టు జగన్ చెప్పారు. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాలను సమర్పించాలి. జిల్లా కేంద్రాల్లో నవంబరు 12న ర్యాలీలు జరుగుతాయి.
Telugu News :Trump:హెచ్-1బీ సంక్షోభంతో అమెరికన్ సంబంధాలకు తగ్గిన డిమాండ్

medical colleges intensifies
ఒక జిల్లాలో నేను కూడా పాల్గొంటాను. నవంబరు 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. నవంబరు 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయ వాడకు తరలిస్తారు. సేకరించిన ఈ సంత కాలు గవర్నర్కు అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది అని వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్సీ హయాంలో విద్యార్థుల డ్రాపౌట్లు లేవు. కూటమి పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కుతున్నారు. ఎరువుల పంపిణీలో కూడా స్కాంలు జరుగుతున్నాయి. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు అని జగన్ మండిపడ్డారు.
భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో వైఎస్సార్సీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది? అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అని జగన్ సూచించారు. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సిఎం చంద్రబాబు సేకరిస్తున్నారు. మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాల కోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షల మందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు? ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా? ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది అని నేతలను ఉద్దేశించి జగన్ అన్నారు.
వైయస్ జగన్ను కలిసిన కాకినాడ మత్స్యకారులు బోటు కొనుక్కోవడానికి కన్యాకుమారి వెళ్లి, బోటుతో సహా తిరిగి వస్తుండగా, తమ జలాల్లోకి ప్రవేశించారంటూ కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక కోస్టుగార్డు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బోటులో చేపలు కూడా లేనప్పటికీ, వారిని శ్రీలంక కోర్టులో ప్రవేశపెట్టడంతో జైలుకు పంపారు. విషయాన్ని ఇక్కడ తమ వారికి తెలియజేయడంతో, వైయస్సార్ నాయకుడు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి చొరవ తీసుకున్నారు. ఇక్కడి అధికారులకు పూర్తి వివరాలు చెప్పి, శ్రీలంక అధికారులకు సమాచారం పంపించారు. దీంతో 54 రోజుల తర్వాత కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు శ్రీలంక జైలు నుంచి విడుదలయ్యారు. శ్రీలంక జైలు నుంచి తమ విడుదలకు చొరవ చూపించిన ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికి కృతఙ్ఞతలు తెలియజేసిన వారు, మంగళవారం వైయస్సార్సీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీమంత్రులు కురసాల కన్న బాబు, దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైయస్ జగన్ను కలిసిన మత్స్యకారులు పంతాడ బ్రహ్మానందం, పి. శ్రీను.. తాము శ్రీలంక చెర నుంచి వైయస్సార్సీ చొరవ వల్లే బయటపడినట్లు చెప్పారు. వైయస్సార్సీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. చక్రవర్తి, కృష్ణా జిల్లా మత్స్యకార సంఘం నాయకుడు కోలా హరికృష్ణ తదితరులు వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: