हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rohit Sharma: ఆస్ట్రేలియా సిరీస్‌పై రోహిత్ శర్మ ఏమన్నారంటే?

Anusha
Latest News: Rohit Sharma: ఆస్ట్రేలియా సిరీస్‌పై రోహిత్ శర్మ ఏమన్నారంటే?

టీమిండియా (Team India) వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ నియామకంపై అభిమానుల్లో చర్చలు జోరుగా సాగుతున్న వేళ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన స్పందనను ఎంతో సమతూకంగా, హుందాగా వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించబడినప్పటికీ, ఆయనలో ఎటువంటి అసంతృప్తి కనిపించలేదు. అసలు నిజమైన క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో రోహిత్ తన మాటలతో మళ్లీ నిరూపించాడు.

Lionel Messi: భారత్ లో పర్యటనించనున్న మెస్సీ.. సమీక్ష నిర్వహించిన కేరళ సీఎం

ముంబైలో జరిగిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల కార్యక్రమంలో రోహిత్ (Rohit Sharma) మాట్లాడుతూ, “ఆస్ట్రేలియాతో ఆడటమంటే నాకు చాలా ఇష్టం. అక్కడికి వెళ్లడం, అక్కడి ప్రజల క్రికెట్ ప్రేమను చూడటం ఎంతో బాగుంటుంది” అని వ్యాఖ్యానించాడు.

కెప్టెన్సీ మార్పు గురించి నేరుగా ప్రస్తావించకపోయినా, ఒక ఆటగాడిగా సిరీస్‌కు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మాటల ద్వారా స్పష్టమైంది.ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) ను నియమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం

సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) లను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. ఈ ఏడాది మార్చిలో రోహిత్ సారథ్యంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం అభిమానులను,

క్రీడా విశ్లేషకులను షాక్‌కు గురిచేసింది.ఈ విషయంపై బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పందిస్తూ, కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్ శర్మకు ముందుగానే సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు.

Rohit Sharma
Rohit Sharma

ఈ మార్పు గురించి రోహిత్‌తో మేం మాట్లాడాం

“ఈ మార్పు గురించి రోహిత్‌తో మేం మాట్లాడాం. ఆ సంభాషణ మా మధ్య వ్యక్తిగతమైనది. కానీ, అతనికి తెలియజేయకుండా నిర్ణయం తీసుకోలేదు” అని అగార్కర్ వివరించారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరగడం లేదని,

అందువల్ల ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం జట్టు ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2027 ప్రపంచకప్ (2027 World Cup) గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870