हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Mohanlal: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం 

Aanusha
Latest News: Mohanlal: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం 

భారత సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈయనకు ఇప్పుడు భారత సైన్యం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సీవోఏఎస్‌ కమెండేషన్‌’ (COAS Commendation) అవార్డు లభించింది. ఈ అవార్డు భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (Chief of Army Staff) చేత ప్రతి సంవత్సరం విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది.

Mitra Mandali Movie: మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) స్వయంగా ఈ పురస్కారాన్ని మోహన్‌లాల్‌కు అందజేశారు. మంగళవారం న్యూ ఢిల్లీ లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాలో పాల్గొన్నారు. సైన్యంలో విశిష్ట సేవలందించిన వారిని సత్కరించేందుకు ఇచ్చే ఈ అవార్డు మోహన్‌లాల్‌ కెరీర్‌లో మరో ప్రాధాన్యత సాధించింది. 

ఈ సందర్భంగా మోహన్‌లాల్‌ (Mohanlal)సోషల్‌మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంటూ.. “ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు గర్వకారణం. ఒక గౌరవ లెఫ్టినెంట్‌ కర్నల్‌ (Lieutenant Colonel) గా ఈ గుర్తింపు పొందడం నా జీవితంలో స్ఫూర్తిదాయకమైన క్షణం. భారత సైన్యం, టెరిటోరియల్‌ ఆర్మీ యూనిట్‌ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

Mohanlal
Mohanlal

మోహన్‌లాల్‌కు భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

మోహన్‌లాల్‌ 2009లో భారత టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కర్నల్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన సైనిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతూ, దేశానికి తనవంతు సేవలు అందిస్తున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా, దేశ సేవకు అంకితమయ్యే వ్యక్తిగా కూడా ఆయన అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 

ఇటీవలే మోహన్‌లాల్‌కు భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) ప్రకటించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు ఇవ్వబడింది. వరుసగా ఇలాంటి గౌరవాలు దక్కించుకోవడం ద్వారా మోహన్‌లాల్‌ తన సత్తా ఏమిటో మరోసారి రుజువు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870