అమెరికా ప్రభుత్వం (US GOVT) ఇటీవల తీసుకొస్తున్న కొత్త వీసా ఆంక్షలు, కఠినమైన నియమాలు భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. విద్య కోసం అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని తాజా డేటా సూచిస్తోంది. ట్రేడ్.జీవోవి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది (2025) అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 44 శాతం తగ్గింది. ఇది గత దశాబ్దంలో అత్యధికంగా నమోదైన తగ్గుదలగా భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకువస్తున్న వీసా స్క్రీనింగ్ ప్రక్రియలు, ఇమ్మిగ్రేషన్ పాలసీల కఠినత వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Gas Cylinder Truck Accident: బాంబుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు!
ముఖ్యంగా ట్రంప్ విధానాల ప్రకారం F-1 స్టూడెంట్ వీసాలు జారీ చేసే ప్రక్రియలో కొత్త రూల్స్ అమలు అవుతున్నాయి. విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడంపై పరిమితులు, వీసా రీన్యువల్‌కు అదనపు ధృవీకరణలు, భద్రతా తనిఖీల పెరుగుదల వంటి అంశాలు విద్యార్థులను వెనుకకు తగ్గిస్తున్నాయి. అదనంగా, అమెరికాలో లివింగ్ కాస్ట్, రెంట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఖర్చులు భారీగా పెరగడం కూడా ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది భారతీయ విద్యార్థులు తమ దృష్టిని ఇతర అభివృద్ధి చెందిన దేశాలపైకి మళ్లిస్తున్నారు.

ప్రస్తుతం భారతీయ విద్యార్థులు యూకే (UK), కెనడా, ఆస్ట్రేలియా (AUS), జర్మనీ వంటి దేశాలను ప్రత్యామ్నాయ గమ్యస్థానాలుగా ఎంచుకుంటున్నారు. ఈ దేశాల్లో విద్యార్థులకు అనుకూల వీసా పాలసీలు, తక్కువ లివింగ్ కాస్ట్, మరియు సులభమైన వర్క్ పర్మిట్లు అందుబాటులో ఉండటం ప్రధాన ఆకర్షణగా మారింది. ముఖ్యంగా జర్మనీ వంటి దేశాలు ఇంజనీరింగ్, సైన్స్, రీసెర్చ్ రంగాల్లో స్కాలర్‌షిప్ అవకాశాలు అందిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం వీసా పాలసీలను సడలించకపోతే రాబోయే సంవత్సరాల్లో అమెరికా స్థానంలో ఇతర దేశాలు భారత విద్యార్థుల ప్రధాన విద్యా గమ్యస్థానాలుగా మారే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/