
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన విభిన్న కథా ఎంపికలతో, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రియదర్శి, ఈసారి ‘మిత్రమండలి’ (Mitra Mandali Movie) అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నారు.
Kotha lokah chapter1: ఓటీటీ లో కి వచ్చిన కొత్త లోక చాప్టర్ 1
ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ బన్నీ వాస్ (Bunny Was) వర్క్స్లో మొదటి ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 (Geetha Arts 2) బాధ్యతల నుంచి కొంత విరామం తీసుకున్న నిర్మాత బన్నీ వాస్, తన కొత్త బ్యానర్ ద్వారా విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
ఇన్‌ప్లుయెన్సర్ నిహారిక NM కథానాయికగా నటించబోతుంది
ప్రియదర్శి (Priyadarshi) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ నిహారిక NM (Niharika NM) కథానాయికగా నటించబోతుంది. ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్ర (S Vijayendra) దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమా బ్యాండ్ ట్రూప్ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: