हिन्दी | Epaper
ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

News Telugu: Mallojula Venugopal: మావోయిస్టు పార్టీలో మళ్లీ మల్లోజుల కలకలం

Rajitha
News Telugu: Mallojula Venugopal: మావోయిస్టు పార్టీలో మళ్లీ మల్లోజుల కలకలం

పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన సాయుధ పోరాటాన్ని వీడాలని క్యాడర్కు పిలుపు హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో సభ్యుడు అయిన మల్లోజుల వేణుగోపాల్రావు Mallojula Venugopal అలియాస్ అభయ్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. పార్టీలో తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం నాడు ఒక ప్రకటన చేసిన మల్లోజుల సాయుధ పోరాటాన్ని వీడాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఇంతకు ముందు మావోయిస్టు పార్టీ ఆయుధాలను వీడాలని, కేంద్రంతో చర్చలు జరపాలని అభయ్ చేసిన ప్రకటన సంచలనం రేపగా దీనిని ఆ పార్టీ ఖండించడంతోపాటు ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది. ఇలాంటి ప్రటకన చేసినందుకు అభయ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మావోయిస్టు పార్టీ ఆయన తన ఆయుధాలను వెంటనే అప్పగించాలని లేకుంటే, పార్టీ క్యాడర్ తీవ్రంగా వ్యవహరిస్తుందని హెచ్చ రించింది. దీనిపై ఓవైపు చర్చ జరుగుతుండగానే మల్లోజుల మరో ప్రకటన విడుదల చేశారు.

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఖాయమైనట్లేనా?

Mallojula Venugopal

Mallojula Venugopal

తాను మావోయిస్టు Maoism పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని, అన్నివార్య కారణాల వల్ల ఈ పదవుల్లో కొనసాగే అర్హత తనకు లేదని అభయ్ తన ప్రకటనలో తెలిపారు. మావోయిస్టు పార్టీ క్యాడర్ వెంటనే సాయుధ పోరాటాన్ని వీడాలని ఆయన పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు అనుసరించిన పంథా పూర్తిగా తప్పని, దీనివల్ల ఉద్యమం తీవ్రంగా నష్ట పోయిందని ఆయన తెలిపారు. మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని ఓటమి పాలుకాకుండా కాపాడలేక పోయినందుకు తాను క్షమాపణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని, ఇలా జరిగివుంటే పరిస్థితి మరోరకంగా వుండేదని ఆయన వెల్లడించారు. అడవుల్లో వుంటూ ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు శతృవులపై దాడులు చేసినంత మాత్రాన విజయం అనుకుంటే అది పూర్తిగా తప్పని, శతృవులు రోజు రోజుకు బలపడుతున్నా ఎందుకు జరుగుతుందనే దానిపై నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందని అభయ్ తెలిపారు.

ఆయుధాలు వీడాలనే నిర్ణయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జీవించి వున్నపుడే ఈ అంశంపై చర్చ జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో పార్టీ అధికార ప్రతినిధి జగన్ Jagan పై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఫాసిస్టు పరిస్థితుల్లో సాయుధ పోరాటం ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని అభయ్ తెలిపారు. అనవసర త్యాగాలకు ఇకనైనా ముగింపు పలికి, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలని అభయ్ హితవు పలికారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన క్యాడర్కు సూచించారు.

మల్లో జుల ఎవరు మరియు ఎలాంటి ప్రకటన చేశారు?
మల్లో జుల (వేణుగోపాల్రావు), మావోయిస్టు కేంద్ర కమిటీ మరియు పొలిట్బ్యూరో సభ్యుడు, మావోయిస్టు పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తానని, పార్టీ క్యాడర్కు సాయుధ పోరాటాన్ని వీడాలని పిలుపునిచ్చారు.

మల్లో జులకు మునుపటి ప్రకటన కారణంగా పార్టీ ఏ చర్య తీసుకుంది?
మావోయిస్టు పార్టీ అభయ్ (మల్లో జుల) ను సస్పెండ్ చేసింది, ఆయుధాలను వెంటనే అప్పగించాలని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870