సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) బి.ఆర్. గవాయ్‌పై ఒక న్యాయవాది షూ విసరడానికి ప్రయత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత అత్యున్నత న్యాయస్థానంలోనే ఈ తరహా సంఘటన జరగడం న్యాయవ్యవస్థ గౌరవానికి పెద్ద దెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడి కేవలం వ్యక్తిగతంగా సీజేఐపై కాకుండా, మన రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులపై దాడిగా భావించాలంటూ పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Vijay Devarakonda Accident : విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం..ఫ్యాన్స్ లో అనుమానాలు..!!
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia ) తీవ్రంగా స్పందించారు. “సుప్రీంకోర్టులోనే సీజేఐపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది గవాయ్ గారిపైనే కాకుండా మన రాజ్యాంగంపైనే దాడి. న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలి” అని ఆమె విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సోనియా గాంధీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul ) కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. “న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అనేది ఎప్పటికీ సమర్థించలేనిది. దేశంలో ఇలాంటి విద్వేషానికి, దూకుడుకు చోటు ఉండకూడదు” అని ఆయన అన్నారు. ఈ సంఘటన ద్వారా న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, భద్రత, గౌరవం వంటి అంశాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రజలందరూ, రాజకీయ పార్టీలు ఏకమై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/