తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు (RTI) అమలు ముఖ్యమైనది. ఈ హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వ వ్యవహారాలపై అడగవచ్చు, వివిధ శాఖల పనితీరును పరిశీలించవచ్చు.
తాజాగా తెలంగాణ ఆర్టీఐ కమిషన్ కొత్త లోగోను అధికారికంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
VC Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్
20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ బృందం (State Information Commission team) ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం హాజరైంది. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
సీఎంను కలిసిన వారిలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు.
కాగా, రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్‌లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే భర్తీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ల బృందం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: