రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్(Hyderabad) రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు దసరా సెలవుల అనంతరం లక్షలాది మంది నగరానికి తిరిగి రావడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద కిలోమీటర్ల మేర హైదరాబాద్ ల్లో (Hyderabad) ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి.
Read also : Vomiting during travel – ప్రయాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..

మెట్రోలో పరిస్థితి ఆందోళనకరం
రోడ్లపై సమస్యలతో విసిగిన ప్రజలు మెట్రో సేవలను ఆశ్రయించడంతో స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్, ఉప్పల్, మియాపూర్ వంటి ప్రధాన స్టేషన్లలో టికెట్ కౌంటర్లు, సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ల వద్ద పొడవాటి క్యూలైన్లు ఏర్పడ్డాయి. సాధారణంగా 10 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియ గంటకు పైగా పట్టింది. ప్రయాణికుల తాకిడి పెరిగిన సమయంలో కొన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు పనిచేయకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. లగేజీతో ఉన్న వృద్ధులు, మహిళలు, పిల్లలు మెట్లపై తోపులాటలతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఊపిరి సలపని రైళ్లు
ప్లాట్‌ఫారాలపై వేచి చూసిన ప్రయాణికులు రైలు వచ్చిన తర్వాత లోపలికి ఎక్కేందుకు మరోసారి పోరాడాల్సి వచ్చింది. ఇప్పటికే నిండిపోయిన రైళ్లలో చోటు లేకపోవడంతో కొన్ని స్టేషన్లలో ప్రయాణికులు ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో అదనపు రైళ్లు నడపాలని ప్రజలు మెట్రో అధికారులను డిమాండ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం పండుగల అనంతరం ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణ పెంచడం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్, మెట్రో రద్దీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఎందుకు పెరిగింది?
భారీ వర్షాలు, దసరా సెలవుల తర్వాత నగరానికి తిరిగి వచ్చిన ప్రజల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్‌లు పెరిగాయి.
మెట్రో స్టేషన్లలో ఎందుకు ఇంత రద్దీ ఏర్పడింది?
రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఎక్కువగా మెట్రోను ఆశ్రయించడంతో స్టేషన్లలో ఊపిరి సలపని రద్దీ ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper :https://epaper.vaartha.com/
Read Also: