
ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికం అవుతున్నాయి. ట్రాఫిక్ (traffic) విభాగం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీటి నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. మితిమీరిన వేగం, మద్యం మత్తు, నిద్రమత్తు, నిర్లక్ష్యం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు అధికంగా జరగడం బాధాకరం.
Visakhapatnam: యారాడ బీచ్‌లో కొట్టుకుపోయిన నలుగురు ఇటలీ పర్యాటకులు.. ఒకరు మృతి
తాజాగా ఛత్తీస్ గఢ్ లోని జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కబీర్ ధామ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం నేషనల్ హైవే 30 రాయ్పూర్ జబల్ పూర్ (Jabalpur) రోడ్డు లోని ఆకలారియా గ్రామం సమీపంలో బొలెరో, ట్రక్కు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళా ఉపాధ్యాయుల, ఒక మైనర్ బాలిక, కారు డ్రైవర్ ఉన్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా వాసులు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత గ్రామస్తులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
గాయపడ్డవారికి చికిత్స కొనసాగింపు
సంఘటన గురించి తెలిసిన వెంటనే చిల్ఫీ పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం మృతులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ప్రయాణీకులను తీసుకెళ్తున్న బొలెరో వాహనం (Bolero vehicle) రాంగ్ రూట్ లో వచ్చిన ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జు అయింది.
ట్రక్కు డ్రైవర్ చిన్న నిర్లక్ష్యం
ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్, ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు, మరో ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ (Truck driver) చిన్న నిర్లక్ష్యం ఐదుగురు ప్రాణాలు బలిగొన్నాయి. నిర్లక్ష్యం, మితిమీరి వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు.
డ్రైవర్ నిద్రమత్తు కూడా కారణం కావచ్చని అంటున్నారు. ఏదిఏమైనా ఇలాంటి ప్రమాదాలు పెరగకుండా పోలీసులు, ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాక, వాహనదారులు కూడా వేగం కంటే ప్రాణం మిన్న అనే స్పృహతో వాహనాలు నడిపితే, రెండువైపులా ప్రమాదాలను నివారించినట్లుగా అవుతారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: