హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు, లేని కాలంలో జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) కేంద్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తూ వ్యవసాయ కూలీలకు వెతులు మిగిలుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) కోసం బడ్జెట్ కేటాయింపులకు కోత పెడుతున్నదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉపాధి హామీ పనులకు రూ.60,000 కోట్లు కేటాయిం పులు జరిగాయి.
Read Also: Srisailam:దివ్యక్షేత్రం శ్రీశైలం – ఆధ్యాత్మికతకు నిలయం

అంతకుముందు ఏడాదీ సవరించిన బడ్జెట్ కేటాయింపులు రూ.7300 కోట్లు ఉండగా పెర గాల్సిన కేటాయింపులపై కోత పడింది. అనుబంధ కటా యింపులలో తరచూ జరుగుతున్న జరుగుతున్న జాప్యం కూడా వ్యసాయ కూలీలను ఆర్థికంగా కూడా దెబ్బతీస్తోం ది. వ్యవసాయ్ ఆఫ్ సీజన్ ముగిసిన తర్వాత అనుబంధ కేటాయింపులు జరగడంతో లక్షలాది మంది కూలీలు ఉపాధి పొందలేక పోవడం, సకాలంలో వేతనాలు లభించకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేతనాల చెల్లిపుంల్లో జాప్యం కారనంగా వేతన బకాయిలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఉపాధికార్మికులకు ఆ పనులపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఉపాది హామీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేసి గత సెప్టెంబర్ 5తో 20 సంవత్సరాలు పూర్తయిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలో ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యాలు నిత్య కృత్యంగా మారా యనే విమర్శలు వస్తున్నాయి.
వేతనాలు కోసం వారాలు లేదా నెలల తరబడి వ్యవసాయ కూలీలు ఎదురుచూ డాల్సిన దుస్థితి ఏర్పడుతోందని అయితే సంబంధిత మంత్రిత్వశాఖ మాత్రం జాప్యాన్ని ఒప్పుకోకుండా ఆ నిందను రాష్ట్రాలపై వేయడానికి ఏమాత్రం సంకోచిం చడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. 2022లోనే లిమిక్ ఇండియా అనే స్వతంత్ర సంస్థ దీనిపై అధ్యయనం చేసి చట్టపరంగా తప్పనిసరిగా 15 రోజుల్లో వేతనాలు చెల్లించాల్సి ఉండగా 71 శాతం వేతనాలలో తీవ్ర జాప్యం జరిగినట్లు వెల్లడించింది. వేతనాల చెల్లింపు లో ఆలస్యం కారణంగా అప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్న వ్యవసాయ కూలీలు మరింత దుస్థితిలోకి కూరుకు పోతున్నారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వైఖరి కారణంగా ఉపాధి హామీ పథకం అసలు లక్ష్యం దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది.
ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని కల్పించాలని చట్టం చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితులు చూస్తే సగటున ఏడాదికి 40 నుంచి 45 రోజులకు మించి పని కల్పించడం లేదు. కొన్ని సార్లు పనులు ఉన్నప్పటికి 25 శాతం మంది కూలీలకు పని కల్పించడం లేదు. దీనికి ప్రధాన కారనం పాలనాపరమైన నిర్లక్ష్యమని లిమిటెక్ తన సర్వేలో పేర్కొంది. దీంతో లక్షలాది మంది కూలీలు, మహిళాలు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ ఉపాధి హామీ పనుల్లో మితిమీరిన కేంద్రం జోక్యంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది, నిధులు విడుదల, జాబ్ కార్డులు తనిఖీలపై కేంద్రం పెత్తనం పెరగడంతో స్థానికపాలనా యంత్రాంగం చేతులు ముడుచుకుని కూర్చోవల్సి వచ్చిందని తన నివేదికలో పేర్కోంది.
నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్ఎంఎస్)ద్వారా ఆధారిత చెల్లింపులు వ్యవస్థ (ఏబిపిఎస్) డిజిటలైజేషన్ హజరు కారణంగా డిజిటల్ వ్యవస్థపై(Digital system) అవగాహన లోపంతో లక్షలాది మంది వ్యవసాయ కూలీలలకు ఉపాధి దక్కడం లేదు. సాంకేతిక సమస్యలు, స్మార్ట్ఫోన్ లేక పోవడం, బయోమెట్రిక్ తేడాల కారనంగా కూడా అర్హులైన లక్షలాది మంది కూలీలు పాధిని కోల్పోతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ పథకంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తోందని తెలిపింది. అంతే కాకుండా ఈ పథకాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ విఫల ప్రయోగంగా అభివర్ణించిందని, దీన్ని బలోపేతంగా చేసే దిశగా కేంద్రం ప్రభుత్వం ఏనాడు ప్రయత్నించలేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొవిడ్ అనంతరం కాలం కూడా దీన్ని బలోపేతం చేసేదిశగా కేంద్రం చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా అధికార యంత్రాంగం కూడా నుంచి కూడా ఎటువంటి మద్దతు లేక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాన్ని లిమ్ఎక్ వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: