బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Season 9) ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది. ప్రతి ఎపిసోడ్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. హౌస్ మేట్స్ మధ్య గొడవలు, భావోద్వేగాలు, మాటల తగాదాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవరెవరిని నమ్మాలి, ఎవరెవరిపై నమ్మకం కోల్పోవాలి అనే విషయాల్లో కంటెస్టెంట్లు ఒక గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ పై నాగార్జున ప్రశంసలు
ఇక ఎలిమినేషన్ల విషయంలో కూడా బిగ్ బాస్ ఈ సారి సస్పెన్స్‌ను బాగా నిలబెట్టాడు. ఇప్పటివరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లగా, తాజాగా కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్ (Haritha Harish) గేమ్ నుంచి బయటకు వెళ్లాడు. గతవారం నామినేషన్లో ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన, శ్రీజ, దివ్య, హరీష్ లు ఉన్నారు. వీరిలో శ్రీజ, హరీష్ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండగా, చివరికి హరీష్ ఎలిమినేట్ అయ్యాడు.
హరీష్ ఎలిమినేట్ అని నాగ్ అనౌన్స్ చేసిన తర్వాత అతను ఎక్కడా ఎమోషనల్ అవ్వలేదు.. హరీష్ ఎక్కడా ఎమోషనల్ కాకుండా ఓకే సార్ అన్నాడు.ఇక స్టేజ్ పైకి వచ్చిన హరీష్ కు నాగార్జున చిన్న టాస్క్ ఇచ్చారు. ఈ హౌస్‌లో ఎవరు బ్లాక్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు అని అడిగాడు. దానికి ముందుగా బ్లాక్ మాస్క్ (Black mask) మీద భరణి ఫొటో పెట్టాడు హరీష్.
నేను ఆయనతో ఆ దూరం మెయింటైన్ చేస్తూ ఉన్నా
భరణి అందరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు.. ఆయన ట్రూ సైడ్ నేను చూశాను సార్..అందుకే నేను ఆయనతో ఆ దూరం మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అని చెప్పాడు. ఆ తర్వాత ఇమ్మానుయేల్ ఫొటోను బ్లాక్ మాస్క్ మీద పెట్టాడు హరీష్. అందరితో ఫ్రెండ్లీగా ఉందాం అన్నట్లు ఉంటారు ఆయన నిజ స్వరూపం ఇంకా బయటికి చూపించలేదని నాకు అనిపిస్తుంది అని అన్నాడు హరీష్..
డీమాన్ పవన్ (Demon Pawan) కి కూడా బ్లాక్ మాస్క్ ఇచ్చాడు హరీష్. డిమాన్ నెమ్మదిగా మాట్లాడే వ్యక్తి సార్.. కానీ తనలో సత్తా చాలా ఉంది.. ఇప్పటివరకూ చూడలేదు..వైట్ మాస్క్‌లో మొదటిగా శ్రీజ ఫొటో పెట్టాడు. ఆమెకి కాస్త తొందరెక్కువ.. 10 సెకన్లు ఫాస్ట్.. ముందుగా ఉంటుంది.. కొన్నిసార్లు తను పెట్టే పాయింట్స్ చాలా బావుంటాయి.. బుల్లెట్స్ లాంటి పాయింట్స్ పెడుతుంది అంటూ శ్రీజను తెగ పొగిడేశాడు హరీష్. ఆ తర్వాత కళ్యాణ్‌కి వైట్ మాస్క్ ఇచ్చాడు.
తను తనలా ఉన్నారని నేను నమ్ముతున్నా
తను తనలా ఉన్నారని నేను నమ్ముతున్నా.. కానీ కొంచెం ఆ రిలేషన్స్ వాటి నుంచి బయటికొచ్చెస్తే మీరు ఇంకా బాగా ఆడగలరు అని కళ్యాణ్ కు సలహా ఇచ్చాడు హరీష్. చివరిగా వైట్ మాస్క్‌పై తనూజ ఫొటో పెట్టాడు హరీష్.
నాలో ఎంతో కొంత నేను తనూజని చూసుకుంటా సార్.. బేసికల్‌గా మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది కొన్ని సందర్భాల్లో కానీ మనసులో ఏం ఉండదు.. కొంత షార్ట్ టెంపర్ ఎక్కువ ముక్కు మీద కోపం.. అందుకే అసహనం, చిరాకు కనబడుతుంటుంది.. తను మాస్క్ పెట్టుకున్నట్లు నాకు అయితే అనిపించలేదు అని చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: