పవన్ కళ్యాణ్ – సుజిత్ (Pawan – Sujeeth) కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’ థియేటర్లలో రికార్డుల వర్షం కురిపిస్తోంది. రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా, మొదటి షోతోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మానరిజమ్స్, సుజిత్ మాస్ డైరెక్షన్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చాయి. ఈ కారణంగా విడుదలైన వారం రోజుల్లోనే సినిమా కలెక్షన్లు అంచనాలకు మించి దూసుకెళ్తున్నాయి.

సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం..‘OG’ ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది. రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డును కూడా ఈ సినిమా బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, విస్తృతమైన స్క్రీన్ కౌంట్, ఆకట్టుకునే ప్రమోషన్స్ ఇలా అన్ని కలిసి సినిమాకు అనూహ్యమైన కలెక్షన్లు తెచ్చాయి. ఈ వసూళ్లతో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాకుండా, 2025 తెలుగు సినీ పరిశ్రమలో కూడా ‘OG’ మైలురాయిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో పవన్ కళ్యాణ్‌తో పోటీ పడడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటించి కథను మరింత బలోపేతం చేశారు. సుజిత్ తన కథనంలో మాస్ ఎలిమెంట్స్‌కి క్లాసిక్ టచ్ కలిపి చూపించిన తీరు ప్రేక్షకులని థియేటర్లకే పరిమితం చేయకుండా రీపీట్ ఆడియన్స్‌ను కూడా రప్పిస్తోంది. దీంతో ‘OG’ కేవలం బాక్స్ ఆఫీస్ హిట్ మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ సినిమా జర్నీలో గోల్డెన్ చాప్టర్‌గా మిగిలిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.