కడప జిల్లాలో భర్తలేని ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఒక ఆశ్రమం లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. సరస్వతి అనే మహిళ ఈ ఆశ్రమాన్ని నడుపుతూ, ప్రభుత్వ సహాయం తీసుకుంటున్నట్లు రికార్డుల్లో ఉంది. రికార్డుల ప్రకారం ఆశ్రమంలో 99 మంది నిర్వాసిత మహిళలు ఉన్నట్లు చూపించారు. కానీ వాస్తవానికి అక్కడ ఒక్క మహిళా నిర్వాసితురాలూ లేకపోవడం ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చింది.
Latest News: Samantha: విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై స్పందించిన సమంత
ఈ అవకతవకలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ (Rayapati Sailaja) తనిఖీల్లో బయటపడ్డాయి. ఆకస్మికంగా ఆశ్రమాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన ఆమెకు, అక్కడ ఒక్క నిర్వాసితురాలూ లేకపోవడంతో షాక్ తగిలింది. వందలాది ప్రభుత్వ నిధులు వినియోగమవుతున్నా, ప్రయోజనం మాత్రం ఎవరికి అందడం లేదని రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమం నిర్వహిస్తున్న సరస్వతిపై సీరియస్ ఆరోపణలు ఎదురవుతున్నాయి.

ఈ ఘటనపై మహిళా కమిషన్ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు రాయపాటి శైలజ తెలిపారు. ఈ స్కామ్ వెనుక ఉన్న నిజాలు వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పేద, నిరాధార మహిళల పేరుతో నిధులు దోచుకోవడం తీవ్రమైన నేరమని పేర్కొంటూ, కడపలో బయటపడిన ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. దీనివల్ల ఇతర జిల్లాల్లోని ఇలాంటి ఆశ్రమాలపై కూడా తనిఖీలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.