కేంద్ర రవాణా శాఖ సెంట్రల్ మోటారు వెహికల్స్ రూల్స్-1989 కింద కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు(Strict measures) తీసుకోవడానికి కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు వాహనంపై చలాన్ పెండింగ్ ఉంటే చిన్నగా తీసుకునేవారు, కానీ కొత్త మార్పులతో 45 రోజుల్లో చెల్లించకపోతే వెంటనే చర్య జరుగుతుంది.
Read Also: Air India: ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది

ముఖ్య మార్పులు
- ఒక వాహనంపై 5 లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్( Driving license suspended)చేయబడుతుంది.
- చలాన్ చెల్లించడానికి ఉన్న గడువు 90 రోజుల్లో నుండి 45 రోజులకు తగ్గింపు చేయబడింది.
- ఈ గడువు దాటితే, వాహనం అమ్మడం, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయడం, మార్పు చేయడం కుదరదు.
- చలాన్ చెల్లించని వాహనాన్ని పోలీసులు సీజ్ చేసుకునే అధికారం కలిగి ఉంటారు.
- ప్రస్తుతం, వాహనం ఎవరు నడిపినా చలాన్ వాహన యజమాని పేరుపై మాత్రమే జారీ అవుతుందని, ఇకపై వాహనం నడిపిన వ్యక్తినే బాధ్యుడిగా చేయనున్నారు.
డిజిటల్ మానిటరింగ్ మరియు నోటీసులు
చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ వంటి ప్రక్రియలను డిజిటల్ మరియు ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయనున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే:
- ఎలక్ట్రానిక్ నోటీసు 3 రోజుల్లో జారీ చేయాలి.
- ఫిజికల్ నోటీసు 15 రోజుల్లో పంపాలి.
కొత్త ట్రాఫిక్ చలాన్ నిబంధనలు ఎప్పుడు అమలులోకి వస్తాయి?
కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం, నిబంధనలు త్వరలో అమలు కానున్నాయి.
45 రోజుల్లో చెల్లించని చలాన్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయి?
వాహనం సీజ్ చేయబడడం, లైసెన్స్ సస్పెండ్ అవ్వడం మరియు డ్రైవింగ్/వాహన మార్పులకు ఇబ్బంది కలగడం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: