బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Season 9)హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో, ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాల్గో వారం ముగింపు దశకు చేరుకుంది. ప్రతి వారం జరిగే నామినేషన్స్, టాస్కులు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బిగ్ బాస్ హౌస్‌పై కట్టిపడేస్తున్నాయి.
Bigg Boss 9: హౌస్ లోకి టాలీవుడ్ కమెడియన్?
ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ఈ ఆదివారం ఎవరు హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి అప్పుడే ఊహాగానాలు, లీక్‌లు జోరందుకున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ (Process of Elimination) కు సంబంధించి నామినేట్ అయిన వారిలో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ దమ్ము, హరిత హరీష్, దివ్య నికితా ఉన్నారు.
ఒక్క దివ్య మినహా.. మిగతా అందరూ ఫస్ట్ డే నుంచి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నావారే. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. నాలుగో వారంలో శ్రీజ దమ్మునే ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఓటింగ్ (Voting) లో మాత్రం శ్రీజ సేఫ్ అయ్యింది. మరి ఆమె కాకుండా ఈ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా మాస్క్ మ్యాన్ హరిత హరీశ్.
హరీశ్ ఈ వారం బ్యాగ్ సర్దుకోక తప్పదని
ఓటింగ్ పర్సంటేజ్ మరీ తక్కువగా ఉండడంతో హరీశ్ ఈ వారం బ్యాగ్ సర్దుకోక తప్పదని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్లలో హరిత హరీష్‌తో పాటు మరికొందరు బలమైన కంటెస్టెంట్లు ఉన్నారు. కాగా అగ్ని పరీక్షతో పాటు బిగ్ బాస్ హౌస్ లోనూ అందరి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు హరిత హరీశ్.
హౌస్‌లో అందరూ ఒక జట్టు అయితే, ఆయనొక్కడే ఒక జట్టు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. తరచూ కంటెస్టెంట్స్ తో గొడవలు పడడం, తన మాటే నెగ్గాలని పంతం పట్టడం, బిగ్ బాస్ చీవాట్లు పెట్టినందుకు భోజనం చేయకుండా నిరాహార దీక్ష చేయడం.. ఇలా మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ కు చాలా కారణాలున్నాయి.
హోస్ట్ నాగార్జున చెప్పినా హరీష్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఈ వారం హరీశ్ బయటకు వచ్చేది ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి హరీశ్ ఎలిమినేషన్ కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఆదివారం (అక్టోంబర్ 04)న జరిగే ఎపిసోడ్ లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: