ఏవిధంగానైనా అమెరికాలో America విదేశీయులు లేకుండా చేయాలనే ప్రయత్నం ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Trump తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. లక్ష డాలర్లు కడితేనే హెచ్ 1బి వీసా అంటూ గతనెల తీవ్ర గందరగోళానికి దారితీసిన ట్రంప్ నిర్ణయం మర్చిపోకముందే మళ్లీ మరో ఆఫర్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వలసదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అమెరికాను స్వచ్చందంగా వదలి వెళ్లిపోయేవారికి 2500 డాలర్లు (రూ.2 లక్షల 21వేలు) చెల్లిస్తామని ప్రకటించారు. అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Japan: జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి

Trump
14 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసున్న వారికి ఈ ఆఫర్ ఉంటుందని పేర్కొంది. స్పందించేందుకు 24గంటల సమయం దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లేవారికి 2500 డాలర్లు ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై మీ స్పందన తెలియచేసేందుకు 24 గంటల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఈ ఆఫర్ ను ముందుగా 17 ఏళ్ల పిల్లల నుంచి ప్రారంభిస్తామని అధికారులు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఖండించిన న్యాయవాదులు కాగా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆఫర్ ను ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఖండించారు.
ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. పిల్లల రక్షణ చట్టాలను ఇది బలహీనపరుస్తుందని ఆరోపిస్తున్నారు. ఇది వాళ్ల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయిన వాపోతున్నారు. ఇదిలా ఉండగా 2021 అక్టోబరు నుంచి తల్లిదండ్రులు లేకుండానే 4 లక్షలకు పైగా పిల్లలు తల్లిదండ్రులు లేకుండానే సరిహద్దులు దాటారు. వాళ్లందరినీ అమెరికా బోర్డర్ అధికారులు అరెస్టు చేశారు. అయితే 2008 చట్టం ప్రకారం వలసదారులను స్వదేశాలకు పంపించే ముందు ఇమిగ్రేషన్ న్యాయమూర్తి వాళ్లని హాజరుపల్చాల్సి ఉంటుంది. కానీ ట్రంప్ యంత్రాంగం ఇవేమీ పట్టించుకోకకుండా వలసదారులను స్వచ్ఛందంగా వెళ్లిపోయేలా చేసేందుకు ఈ ఆఫర్
నేను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది?
అమెరికా నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోయేవారికి 2,500 డాలర్లు (సుమారు రూ.2.21 లక్షలు) చెల్లిస్తామని ప్రకటించింది.
ఈ ఆఫర్ ఎవరికీ వర్తిస్తుంది?
14 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వలసదారులకు వర్తిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: