ప్రేమజంటలు, ఒంటరి అమ్మాయిలే టార్గెట్ గోప్యతను వీడియో తీసి ఆపై బెదిరించడం చిత్తూరు : చిత్తూరు మురకంబట్టు నగరవనం పార్కు పరిసరాల్లో ప్రేమజంటలు, ఓంటరి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద వున్న నగదు దోచుకోవడంతో పాటు వారిని శారీరకంగా అనుభవించడమే మైనర్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టైన నిందితుల వృత్తి అని చిత్తూరు డిఎస్పీ సాయినాధ్ Chittoor DSP Sainath పేర్కొన్నారు. మురకంబట్టు Murakambattu నగరవనంలో అత్యాచారంకు గురైన మైనర్ బాలిక కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం చిత్తూరు తాలుకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Karnataka: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య, ప్రమాదంగా నాటకం!

Crime
ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ సాయినాధ్ శుక్రవారం చిత్తూరు జిల్లా పాత పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితులైన చిత్తూరు మురకంబట్టు జికెనగర్కు చెందిన ఎం.మహేష్ అలియాస్ కట్టమంచి మహేష్(21), మురకంబట్టు ఎం. ఆగ్రహారంకు చెందిన పి.కిషోర్(31), సంతపేట మంగసముద్రంకు చెందిన జె. హేమంత్ ప్రసాద్(27)లను పోలీసులకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చిత్తూరు నగరంలోని చెన్నమగుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగ అరుగుల సమీపంలో అరెస్టు చేశామన్నారు.
మైనర్ అమ్మాయిని
ఈ కేసులో నిందితుడైన మహేష్ 2019 సంవత్సరంలో చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ అమ్మాయిని ఈవ్తోజింగ్ చేసిన కేసులో నిందితుడిగా వున్నాడన్నారు. అలాగే మరో నిందితుడు కిషోర్ 2022 సంవత్సరంలో నగరంలోని ఓ వైన్ షాపులో పని చేస్తూ షాపులోని మద్యంను బ్లాక్ విక్రయిస్తున్నాడని కేసు నమోదు అయ్యిందన్నారు. ఈ కేసులోని నిందితులు ముగ్గురు కాలక్షేపం కోసం పార్కులకు వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద వున్న నగదును దోచుకుని వారిని శారీరకంగా అనుభవించడం వీరి నేర ప్రవృత్తి అని తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద వున్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ కేసు ఏ జిల్లాలో జరిగింది?
చిత్తూరు జిల్లా మురకంబట్టు నగరవనం పరిసరాల్లో జరిగింది.
నిందితులు ఎవరూ?
ఎం. మహేష్ అలియాస్ కట్టమంచి మహేష్ (21), పి. కిషోర్ (31), జె. హేమంత్ ప్రసాద్ (27).
Read hindi news: hindi.vaartha.com
Read Also: