కర్ణాటకలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ముఠా చేసిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. హోస్పేటకు చెందిన గంగాధర్ (34) తన పేరుమీద రూ.5 కోట్ల బీమా చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన ముఠా, అతడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంలా చూపించాలని కుట్ర పన్నింది.
Read also :మరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

‘ప్రమాదం’గా మార్చిన హత్య
ముఠా సభ్యులు గంగాధర్‌ను చంపిన తర్వాత అతని మృతదేహాన్ని టీవీఎస్ స్కూటర్‌పై[TVS scooter] కూర్చోబెట్టి, కారుతో ఢీకొట్టారు. అనంతరం ఇది ప్రమాదంలో మరణమని నమ్మించే ప్రయత్నం చేశారు. తర్వాత ముఠాకు[gang] చెందిన ఓ మహిళ తానే గంగాధర్ భార్యనంటూ ముందుకు వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నించింది.
అసలు భార్యతో కుట్ర బట్టబయలు
అయితే నిజమైన భార్య శారదమ్మ పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. తన భర్తకు పెరాలసిస్ కారణంగా శరీరంలో ఎడమవైపు పనిచేయదని, టూవీలర్ నడపడం అసాధ్యమని ఆమె చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానం కలిగి దర్యాప్తు జరిపి నిజం బయటకు తీశారు.
24 గంటల్లో ముఠా అరెస్ట్
కేవలం ఒక రోజులోనే పోలీసులు ముఠా సభ్యులందరినీ పట్టుకున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసి ప్రమాదంలా చూపించే కొత్త తరహా నేరాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు.
గంగాధర్ హత్య వెనుక కారణం ఏమిటి?
అతని పేరుమీద రూ.5 కోట్ల ఇన్సూరెన్స్ ఉండటమే ముఠా కుట్రకు కారణం.
కుట్ర ఎలా బయటపడింది?
అసలు భార్య శారదమ్మ భర్తకు పెరాలసిస్ ఉన్నందున టూవీలర్ నడపడం అసాధ్యమని చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: