ప్రేమ అనే రెండక్షరాల మధ్య వర్ణించలేని అనురాగం దాగుంది. ప్రేమ అంటేనే నమ్మకం, ఆ నమ్మకం లేని ప్రేమ అదసలు ప్రేమే అనిపించుకోదు కదా! ప్రేమ గుడ్డిదని అంటారు కానీ కొందరికి మనసు కూడా మూగదే, కళ్లు ఉండీ నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోలేక ఉన్మాదంగా ప్రవర్తిస్తుంటారు.
Suicide : ప్రేమ పెళ్లి.. వారం రోజులకే నవ వధువు సూసైడ్
ఒకరిపై ఒకరికి నమ్మకం.. ప్రేమ లేనప్పుడు విడిపోవడమే బెటర్, బ్రేకప్ చెప్పుకుని, ఎవరి జీవితాన్ని వారు హ్యాపీగా జీవించవచ్చు. కానీ ప్రేమ ఉన్మాదంగా మారి, చంపుకునేంతలా చేసింది ఈ జంట విషయంలో. మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) ని మీరట్ ప్రేయసిని నీటిడ్రమ్ములో వేసి హతమార్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
చంపి, పోలీసులకు లొంగిపోయిన ప్రియుడు
దేవాస్ జిల్లాకు చెందిన లక్షిత చౌదరి (22), మనోజ్ చౌహాన్ (Manoj Chauhan) అలియాస్ మోను ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే లక్షిత మరో వ్యక్తితో మాట్లాతుందన్న అనుమానంతో ఆమెను హతమార్చాడు ప్రియుడు మనోజ్. లక్షత మూడురోజులుగా కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మనోజ్ లక్షితను హతమార్చిన తర్వాత నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నీలిరంగు డ్రమ్ లో ఉన్న లక్షత (Lakshta) బెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. లక్షితను, తాను ప్రేమిస్తున్నానని, కానీ ఆమె వేరొకరితో సంబంధంలో ఉందని తెలుసుకున్న కోపంతో ఆమెను చంపేశానని మనోజ్ పోలీసులకు తెలిపాడు.
పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య
మనోజ్ పక్కా ప్రణాళికను రచించి, లక్షితను తన ఇంటికి పిలిపించుకున్నాడు.ఇంటికొచ్చిన లక్షిత ఆమె చేతులు, కాళ్లే కట్టేసి, నీళ్లు నింపిన డ్రమ్ములో ముంచి చంపేశాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు దేవాస్ పోలీసు అధికారి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: