హైదరాబాద్ : రీజనల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఆలైన్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. 2013 చట్టం ప్రకారం పేద రైతులకు న్యాయం(Justice for farmers) చేయాలని, ఈ నెల 6న తమ పార్టీ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ ముందు నిర్వాసితులతో ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఆలైన్మెంట్ మార్పు, ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆరోపణలతో పాటు నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలనీ, 2013 చట్టం ప్రకారం పేర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Kaleshwaram Project:మేడిగడ్డ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు

రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు, నిర్వహించకుండా, భూమి సేకరణలో స్పష్టతనివ్వకుండా బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రైతుల నుండి తీవ్రమైన ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొత్తం 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో ఆ రోడ్డును నిర్మించాలని హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు.. దీనికోసం భూములు తీసుకుంటామనీ, రైల్వే ట్రాక్ కోసం మరొక 40 అడుగుల వెడల్పుతో రోడ్డును పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నదని తెలిపారు. ఇంతకు ముందు మొదటి అలైన్ మెంట్ తయారు చేశారనీ, తర్వాత దాన్ని మార్చి రెండోసారి ఆలైన్ మెంట్, ఇప్పుడు మూడో అలైన్‌మెంట్‌ను(Alignment) తయారు చేసి విడుదల చేశారని చెప్పారు. ఇందులో రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్న వారి భూముల జోలికి వెళ్లకుండా, ఎకరం, రెండు, మూడెకరాలున్న చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన భూములున్న ప్రాంతాన్నే రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణ లొస్తున్నాయని గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: