हिन्दी | Epaper
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Latest News: House Mates Movie:హౌస్ మేట్స్(జీ 5) మూవీ రివ్యూ

Aanusha
Latest News: House Mates Movie:హౌస్ మేట్స్(జీ 5) మూవీ రివ్యూ

తమిళ చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన తాజా చిత్రం “హౌస్ మేట్స్” (Housemates (Zee5) Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు నవ్వులు పంచే విధంగా తీర్చిదిద్దబడింది. ప్రధాన పాత్రల్లో దర్శన్, ఆర్ష, కాళీ వెంకట్, వినోదిని విద్యానాథన్ వంటి అతి ప్రతిభావంతులైన నటులు నటించారు.

Bigg Boss 9: హౌస్ లోకి టాలీవుడ్ కమెడియన్?

ఈ సినిమాలోని కథ, పాత్రలు, సన్నివేశాల సమన్వయం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ‘జీ 5’ (Zee5)లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్నటి నుంచి తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ

కార్తీక్ (దర్శన్) ‘అనూ’ (ఆర్ష) ప్రేమించుకుంటారు. కార్తీక్ (Karthik) కి తన అనే వాళ్లెవరూ ఉండరు. అతని కోసం తన పేరెంట్స్ ను ఎదిరించి ఆర్ష పెళ్లి చేసుకుంటుంది. ఆమె కోసం కార్తీక్ తాను దాచుకున్న డబ్బుతో ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ను కొంటాడు. ఇద్దరూ కలిసి కొత్త ఫ్లాట్ లోకి దిగిపోతారు. అయితే మొదటి రోజు నుంచే ఆ ఇంట్లో చిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది. దాంతో ఆ ఫ్లాట్ లో దెయ్యాలు ఉన్నాయనే ఒక నిర్ణయానికి అనూ వచ్చేస్తుంది. ఆ విషయాన్ని గురించి ఆరా తీయడానికి ‘అనూ’ ప్రయత్నిస్తుంది.

House Mates Movie
House Mates Movie

కానీ ఎవరూ కూడా ఆమెతో ఏమీ చెప్పరు. అదంతా ఆమె భ్రమ అంటూ లైట్ తీసుకుంటారు. కొంతకాలం క్రితం అదే బ్లాక్ కి చెందిన ఒక ఫ్యామిలీ, కారు ప్రమాదంలో చనిపోయినట్టుగా కూరగాయలమ్మే వ్యక్తి అనూ (Anu) తో చెబుతాడు. అప్పటి నుంచి ఆమెలో మరింత భయం మొదలవుతుంది. గోడలపై చిన్నపిల్లలు గీసినట్టుగా బొమ్మలు .. టీవీ దానంతట అది ఆన్ అవుతూ ఉండటం .. కుర్చీలు వాటంతట అవి జరిగిపోతూ ఉండటం చూసి ఆమె మరింత హడలెత్తిపోతుంది. జరుగుతున్న సంఘటనల గురించి అనూ చెప్పినప్పటికీ, కార్తీక్ తేలికగా కొట్టి పారేస్తాడు.

కథనం

ఒక రోజున అతను ఇంట్లో ఉండగానే అలాంటి సంఘటనలు జరుగుతాయి. దాంతో అనూ భయపడటంలో అర్థం ఉందని భావిస్తాడు. తమతో పాటే ఆ ఇంట్లో అదృశ్య రూపంలో ఎవరో ఉంటున్నారనే విషయం అతనికి అర్థమవుతుంది. తమ ఫ్లాట్ లో అదృశ్య రూపంలో ఉంటున్నది రమేశ్ .. అతని భార్య విజ్జి .. పదేళ్ల కొడుకు మహి అనే విషయం తెలుసుకుంటాడు. రమేశ్ (Ramesh) భార్యాబిడ్డల నేపథ్యం ఏమిటి? ఆ ఫ్యామిలీ కార్తీక్ కి ఎందుకు కనెక్ట్ అవుతుంది? అది తెలుసుకున్న కార్తీక్ ఏం చేస్తాడు? అనేది మిగతా కథ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870