हिन्दी | Epaper

Latest Telugu news : Los Angeles – లాస్‌ ఏంజిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

Sudha
Latest Telugu news : Los Angeles – లాస్‌ ఏంజిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

అమెరికా కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌ (Los Angeles) నగరంలో భారీ అగ్నిప్రమాదం (Fire Breaks) సంభవించింది. లాస్ ఏంజిల్స్ (Los Angeles)అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా ఉన్న శివారు ప్రాంతమైన ఎల్‌ సెగుండో ప్రాంతంలో గల చెవ్రాన్‌ చమురు శుద్ధి కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి.

 Los Angeles - లాస్‌ ఏంజిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం..
Los Angeles – లాస్‌ ఏంజిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

కాసేపటికే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడడ్డాయి. దీంతో ఆకాశం మొత్తం అగ్నిగోళాన్ని తలపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కాలిఫోర్నియా అధికారులు సూచించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో శుద్ధి కర్మాగారం నుంచి పెద్ద శబ్దంతో మంటలు ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.నివేదికల ప్రకారం.. చెవ్రాన్స్ చమురు శుద్ధి కర్మాగారం కాలిఫోర్నియాలో రెండో అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ. ఇది రోజుకు 276,000 బ్యారెళ్లకు పైగా ముడి చమురును ప్రాసెస్ చేస్తుంది. వీటిలో గ్యాసోలిన్‌, జెట్‌, డీజిల్‌ ఇంధనాలు ఉన్నాయి. ఈ శుద్ధి కర్మాగారం దాదాపు 1.5 చదరపు మైళ్లు (3.9 చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది.

లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి?

వాతావరణ మార్పు LA మంటలకు కారణం కాదు. మంటలను రగిలించిన నిప్పురవ్వలు దాదాపుగా మానవులు సృష్టించినవే, బహుశా విద్యుత్ లైన్లు లేదా బాణసంచా వల్ల కావచ్చు.

2025 లో లాస్ ఏంజిల్స్లో ఏమి జరిగింది?

2025 జనవరిలో లాస్ ఏంజిల్స్ కౌంటీలో సంభవించిన వినాశకరమైన కార్చిచ్చుల శ్రేణి 31 ప్రత్యక్ష మరణాలకు దారితీసిందని కాలిఫోర్నియా అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి, అయితే స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు హెల్సింకి విశ్వవిద్యాలయం చేసిన కొత్త అధ్యయనం వాస్తవ మరణాల సంఖ్య దాదాపు 15 రెట్లు ఎక్కువగా ఉందని సూచిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

📢 For Advertisement Booking: 98481 12870