మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వాడా జిల్లాలో కలుషిత దగ్గు మందులు కుర్రప్రాణాలను బలిగొన్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో తొమ్మిది మంది చిన్నారులు కిడ్నీలు విఫలమై మృతి చెందడం కలకలం రేపుతోంది.స్థానిక అధికారుల ప్రకారం, సాధారణ జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు ఇచ్చిన దగ్గు సిరప్ కారణంగా అనారోగ్యం[Illness] ప్రాణాంతకంగా మారింది. పరాసియా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ శుభం యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఐదుగురు చిన్నారులు ‘కోల్డ్‌రెఫ్’ సిరప్, మరొకరు ‘నెక్స్‌ట్రో’ సిరప్ వాడినట్లు తేలింది. ఇందులో ఉన్న డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ రసాయనం మూలంగానే ఈ మరణాలు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Read also: America: భారత్‌పై అమెరికా ఒత్తిడికి పుతిన్ తీవ్ర హెచ్చరిక..
ప్రభుత్వ చర్యలు – మందులపై నిషేధం, పర్యవేక్షణ కఠినతరం
ఘటనలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అనుమానిత దగ్గు సిరప్‌లను మార్కెట్‌లో నుంచి ఉపసంహరించి, నమూనాలను పరీక్షల కోసం పంపింది. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా ఒక చిన్నారి మృతి చెందడంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) విచారణ ప్రారంభించింది.
ఇప్పటివరకు 1,420 మంది చిన్నారులను ఆరోగ్య అధికారులు పర్యవేక్షణలోకి తీసుకున్నారు. జ్వరం, జలుబు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని సివిల్ ఆసుపత్రుల్లో 6 గంటల పాటు పరిశీలనలో ఉంచుతున్నారు. పరిస్థితి విషమిస్తే జిల్లా ఆసుపత్రులకు తరలించి, కోలుకున్న తర్వాత ఆశా కార్యకర్తల పర్యవేక్షణలో ఉంచుతున్నారు.
ప్రైవేటు వైద్యులకు కూడా కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి – వైరల్ జ్వరాలకు[viral fevers] చికిత్స చేయకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలని సూచించారు. ఇకపోతే, నీరు, దోమల నమూనాలు సేకరించి పరీక్షలు చేసినప్పటికీ ఏ సమస్యలు కనబడలేదు. దీంతో దృష్టంతా దగ్గు మందులపైనే కేంద్రీకృతమవుతోంది.
రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే 19 బ్యాచ్‌ల దగ్గు సిరప్‌ల విక్రయాలపై నిషేధం విధించింది.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు?
కేవలం 15 రోజుల్లో 9 మంది చిన్నారులు మరణించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: