బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Season 9) ఊహించని ట్విస్టులు, సర్ప్రైజ్ లతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్స్ దశకు చేరుకుంది. ప్రతి వారం కొత్త కొత్త డ్రామాలు, గొడవలు, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Bigg Boss 9: హాటు హాటుగా కొనసాగుతున్న నామినేషన్స్
బిగ్ బాస్ హౌస్ నుంచి మరో వికెట్ పడాలంటే శనివారం వస్తేనే కానీ.. ఎవరు ఎలిమినేట్ (Eliminate) అవుతున్నారనేదానిపై క్లారిటీ వచ్చేది కాదు. కానీ ఈవారంలో ఎగ్జామ్ పేపర్ ముందే చేతికిచ్చి ఎగ్జామ్ రాయించినట్టుగా ఉంది పరిస్థితి. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగుర్ని చూస్తే పడే వికెట్ ఎవరిదనేది ముందే ఫిక్స్ అయిపోవచ్చు.
ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు
ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్ నుంచి మూడు వికెట్లు పడ్డాయి. తొలివారంలో శ్రష్టీ వర్మ, రెండోవారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియశెట్టిలు ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజనా, హరిత హరీష్, శ్రీజా దమ్ము, దివ్య నిఖిత ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.

అయితే తొలివారంలో ఫ్లోరా షైనీ (Flora Shiny) నామినేషన్స్‌లో ఉంటే.. ఎలిమినేట్ అయ్యేది ఆమే అని అంతా అనుకున్నారు. కానీ.. మూడో వారానికి వచ్చేసరికి ఆమె టాప్ ఓటింగ్‌లో ఉంది. అంటే ఈమె గేమ్‌లో పుంజుకుని అద్భుతంగా రాణిస్తుందని కాదు.. మూడోవారంలో ప్రియశెట్టిని ఎలిమినేట్ చేయడం కోసం.. లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న ఫ్లోరా షైనీకి ఓట్లు వేసి టాప్‌లో నిలబెట్టారు.
ఈవారంలో ఎలిమినేషన్ పిక్చర్ గతవారం కంటే క్లియర్‌గా
ఆమె ఆటలో అయితే ఎలాంటి మార్పు లేదు. అక్కడ ప్రియశెట్టిపై ఉన్న కోపంతో ఫ్లోరా షైనీకి ఓట్లు గుద్దిపడేశారు.అయితే ఈవారంలో ఎలిమినేషన్ పిక్చర్ గతవారం కంటే క్లియర్‌గా కనిపిస్తుంది. మూడో వారంలో చూస్తే ప్రియశెట్టి (Priyashetty) తో పాటు.. కళ్యాణ్ పడాల కూడా నామినేషన్లో ఉండటంతో బయటకు పోవడానికి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి ప్రియశెట్టినే ఎలిమినేట్ అయ్యింది.
కాగా.. ప్రియశెట్టిని ఎలాగైతే నామినేషన్స్‌లోకి వస్తుందా? అని వెయిట్ చేశారో.. దమ్ము శ్రీజా కోసం కూడా ఆడియన్స్ అలాగే వెయిట్ చేశారు. గత వారం ఈమె నామినేషన్స్‌లోకి వచ్చింది కానీ.. ఢమాల్ పవన్ కెప్టెన్సీ పవర్‌తో సేవ్ చేయడంతో బతికిపోయింది. లేదంటే ప్రియశెట్టికంటే ముందే దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యేది.
ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం
కానీ ఈ నాలుగో వారంలో దమ్ము శ్రీజ (Srija) నామినేషన్స్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో ఈవారంలో ఆమె ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. సగానికి సగం మంది రెండో మాట లేకుండా దమ్ము శ్రీజకి ఓట్లు గుద్దిపారేస్తున్నారు.
ఆమెకు దాదాపు 41 శాతం మంది ఎలిమినేట్ అవుతుందని ఓట్లు వేయగా.. రెండో స్థానంలో 19 శాతం ఓట్లతో హరిత హరీష్ ఉన్నాడు. 14 శాతం ఓట్లతో రీతూ చౌదరి మూడో స్థానంలో ఉంటే.. ఫ్లోరా షైనీ 10 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లిన దివ్య నిఖిత 8 శాతం శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంటే.. సంజన 7 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: