మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump ) ప్రతిపాదించిన గాజా పీస్ డీల్ కు ఖతర్, పాకిస్తాన్ సహా ఎనిమిది ముస్లిం దేశాలు ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, హమాస్‌కు ఒరిజినల్ డీల్ కాకుండా వేరే పేపర్స్ పంపినట్లు అమెరికా ఆధారిత మీడియా రిపోర్టులు వెలువరించాయి. దీంతో ఈ ఒప్పందంపై కొత్త వివాదం తలెత్తింది.
Ramreddy Damodar Reddy Dies : మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత
వార్తల ప్రకారం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూచనల మేరకు ట్రంప్ ప్రతిపాదించిన ఒరిజినల్ ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పులు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న కండీషన్లను కలిగి ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు, హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను వదులుకోవాలని ఒప్పందంలో షరతుగా పెట్టడం, భవిష్యత్ సరిహద్దు నియంత్రణపై ఇజ్రాయెల్‌కు అధిక హక్కులు ఇవ్వడం వంటి అంశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మార్పులే హమాస్‌ను అసంతృప్తికి గురి చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక హమాస్ ఈ ఒప్పందంలోని కొన్ని కీలక అంశాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయుధాలను పూర్తిగా వదులుకోవాలన్న రూల్, కొన్ని రాజకీయ–ప్రాంతీయ షరతులు హమాస్‌కు అభ్యంతరం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గాజా పీస్ డీల్ భవిష్యత్తు ఏమవుతుందో అనిశ్చితి నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నప్పటికీ, హమాస్ ఈ షరతులను అంగీకరిస్తుందా? లేక కొత్త ప్రతిపాదనలు వస్తాయా? అన్న ప్రశ్నలపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమవుతోంది.