నాగరిక సమాజ నిర్మాణంలో అసంకల్పితంగా అనాగరికంగా తయారవుతున్నామా అనే సందేహం ఈ మధ్య జరుగుతున్న దుర్ఘటనలు తెలియపరుస్తున్నాయి. కరూర్ దుర్ఘ టన (తమిళనాడులో జరిగింది) ఒక్క టి చాలు! ఇలాంటి వాటికి అడ్డం పట్టటానికి. అట్టహాసంగా ప్రతిక్రియా ఉండాలనే తాపత్రయం మన దేశం లో
ముఖ్యంగా దక్షిణాదిన రోజురోజు కూ పెచ్చుమీరిపోతున్నది. రాజకీయాల్లోకి సినిమా నటులు వస్తే రాజకీయ ఉన్నత పదవులు వాటంతట అవే వస్తాయనే ఆలోచనలు కాస్త పేరు తెచ్చుకున్న, తెచ్చుకుంటున్న ఏ నటుడికైనా, నటులకైనా ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. ముఖ్యంగా జన బాహుళ్యంలో పేరున్న జనం మధ్య పెరిగిన ఎవరైనా రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తే, వారికున్న విషయ పరిజ్ఞానంతోటి, అపారమైన అనుభవం తోటి సమాజానికి తమవంతుగా, ఇతోధికంగా సేవతోపాటు సహాయ సహకారాలు అందించే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. అంత మాత్రాన వారి రాకతో ప్రతిపక్షాలూ, తమను కాదనుకొనేవారు ఉలిక్కిపడేలా భారీ సభలూ, సమావేశాలు పెట్టి అదుపు చేయలేని (Uncontrollable)సంఖ్యలో జనసమూహాలను రప్పిం చి అక్కడ ఏదైనా జరుగుతే తమకేమీ సంబంధంలేదని, అది పోలీసుల, ప్రభుత్వాల బాధ్యత అని సుతారంగా చెప్పి తప్పు కోవటం సరికాదేమో! బాధ్యత అనేది కేవలం పోలీసులకూ, ప్రభుత్వాలకే సంబంధించిన సమస్య అనుకుంటే, ప్రజాస్వామ్య పరధులను అవగాహన చేసుకోలేదని భావించక తప్పదు. సినిమా నటులను ప్రేమించనివారు చాలా తక్కువ మంది! నిత్య జీవితంలో వారు భాగమయ్యారు. ఈ మధ్య టివిలూ, మరికొన్ని సౌకర్యాలు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడానికి దృశ్య మాధ్యమాలు విరివిగా అందుబాటు లో ఉండటంతో సినిమాలు చూడటం తక్కువయింది. కానీ పేరుగాంచిన నటుల ఫాన్స్ మాత్రం హెచ్చుసంఖ్యలో జన జీవనంలో భాగం కావటమే కాకుండా, వారు అభిమానించే నటుల మీద యీషణ్మాత్రం కూడా విమర్శలు కానీ, విరుపులు కానీ రానీయకుండా వారి చుట్టూ రక్షణ నిలయాలుగా అభిమాన ఈ సంఘాలు పనిచేయడం ముదావహం. కానీ తప్పొప్పుల విచక్షణ లేకుండా ప్రతిదీ తాము భావించిందే కరెక్టు అని అనుకోవటంలో సమాజంలోని హెచ్చుమందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. తమ పేరుతో ఫాన్స్ సంఘా లు శృతిమించుతున్న సమయాలలో ఈ సంఘాలలో ఉన్న చాలా మంది ప్రసిద్ధులైన నటులు వీరివల్ల ఏ ఇబ్బందులు కలిగినా ఆ సంఘాలను తప్పుపట్టడానికి వెనుకాడటంలేదు. అయినా సరే కొన్నిసార్లు రాజకీయ కార్యకర్తల మాదిరే వెనుకడుగు వేయకుండా తమ మాటే నెగ్గించుకొనే ప్రయ త్నం ఈ సంఘాలు చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇంతవరకూ ఏ ప్రాముఖ్యత కలిగిన విషయంలోనూ వారు నిర్ణయాత్మకంగా ఉండకపోవడంతో టీ కప్పులో తుపాను మాదిరి ఆ సంఘటనలు చల్లారిపోతున్నాయి. సాధ్యమైనంతవరకూ అభిమాన సంఘాలు ఒక సమస్యను హైటైల్ చేయడం వరకే చేస్తున్నారు. అంతకు మించి ఇబ్బందికరంగా వ్యవహరించకపోవటం గమనార్హం. సమస్యల్లా ఆకతాయిలు విచ్చలవిడిగా తిరిగేవారు, గుంపు లు గుంపులుగా నిర్వాహకుల సహకారంతో సభలకు పెద్ద ఎత్తున రావటం మాబ్ గా (Mob Psychology) రూపాంతరం చెంది ఈ పోలీసులు మాటకానీ, నిర్వాహకుల మాటకానీ లెక్క చేయకుండా ప్రాణాంతకమైన పరిస్థితులు కల్పించడం ఈ మధ్య ఎక్కువ యింది. పైగాకార్యనిర్వాహకులకు పూర్తిగా వారెవరో తెలియదు. పోలీసులు కండిషన్లను లెక్కచేయటం లేదని నిర్వా హకులకు చెబుతున్నప్పుడు వారిని కూడా లెక్కచేయకుండా మాబ్ మెంటాలిటీతో తొక్కిసలాట లాంటి సంఘటనలకు కారణమవుతున్నారు. గుంపులో గోవిందలా వారి పనిఉంది. ఎంత మంది పోలీసులున్నా, బలప్రయోగం చేసినా, పరిస్థి తులు అదుపు తప్పటం ఇలాంటి అన్ని సంఘటనల్లోనూ సంభవిస్తున్నాయి.

శాంతి భద్రతల సమస్యలు
కరూర్ సంఘటన సందర్భంగా నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్లోని విషయాలు ఎంతవరకూ వాస్తవాల ను ప్రతిబింబిస్తున్నాయో తెలియదు కానీ, ప్రాథమికంగా అనే సాక్షాలుగా కోర్టులలో నిలబడితే, ఇలాంటి ఘటనల్లో అనవసరంగా కోల్పోయిన నిండు ప్రాణాలను, పసి ప్రాణాలను, తల్లుల, తండ్రుల గుండె కోతలను కళ్ల ముందుంచుతా యి. పోలీసులు ఎలాంటి నిబంధనలు పెట్టి ఈ బహిరంగ సభకు అనుమతి ఇచ్చారో అప్రమత్తం! ఎందుకంటే అలాంటి నిబంధనలు కేవలం కాగితాలకే పరిమిమవుతున్నాయి. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడినప్పుడు నిర్వాహకులు, నాయ కులూ తమవంతు పాత్రను పోషించకుండా, సమూహాలను (Mob Psychology)నియంత్రించకుండా భారమంతా దేవుడికి వదిలేసి పలాయ నం చిత్తశిస్తున్నారు. భారతదేశంలో స్వతంత్ర్యం రాక మునుపు, పరాయి పాలనలో మృగ్గుతున్నప్పుడు జాతిపిత గాంధీ మహాత్ముడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాకరణోద్య మంలోనైనా, సత్యాగ్రహంలోనైనా సభలూ, సమావేశాలు చేసినప్పుడు ప్రజలు అదుపు తప్పితే ఆ సభలనూ, సమావే శాలనూ ఊరేగింపులనూ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటిం చి మధ్యలోనే నియంత్రించడానికి, ఆపు చేయడానికి వెనుకాడకపోయేవారు. నిజానికి పరాయి పాలనలో అధికారాలను ధిక్కరించడానికి సహాయ నిరాకరణోద్యమానికి నడుం కట్టిన ప్పుడు అంతగా నైతిక విలువలను పాటించాల్సిన అవసరం లేదని ఒక్క క్షణమైన ఆలోచించకపోయే నాయకుడు అవ టంచేతనే గాంధీ మహాత్మాగా, జాతిపితగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నాయకుడు ముందుండి నడిపించినప్పుడే నాయకులు అని పిలిపించుకోటానికి అర్హత లభిస్తుంది. అప్పుడే సార్థకత నాయకత్వానికి సమకూరు తుంది. స్వతంత్ర భారతదేశంలో మన ప్రజలను మనం పాలించుకుంటున్న రోజుల్లో గతకాలంలోని నాయకులు పాటించిన విలువలను ఇప్పుడు జ్ఞాపకం చేయాలనిపిస్తున్న ది. కానీ ఇప్పుడు అవి ఎంతవరకు ఈ కాలపు రాజకీయ ప్రతినిధులూ, నాయకులూ ప్రజలూ పరిగణనలోకి తీసుకోగ లరు అని ఆలోచించటానికి కూడా మనస్కరించటం లేదు.

స్వీయ నియంత్రణ అవసరం
కాలం మారిపోయింది. విలువలు అడుగంటాయి. లక్ష్యం సాధించడానికి మార్గం మహత్తరంగా నిర్ణయించుకోవాలన్న నిబంధనలు అటకెక్కాయి. నేనూ, నా అధికారం, నాస్వార్థం నిలువెల్లా ఆక్రమించుకున్నప్పుడు అహం ఏ చిన్న మంచి ఆలోచననైనా మధ్యలోనే త్రుంచేస్తుంది. నా బాధ్యత అంటూ ఏదీ లేదు. పక్కవాడిదే బాధ్యత, తప్పు నాది కాదు. ఈ సమాజానిదే అన్న ధోరణిలో తప్పించుకొని పోవటానికి అలవాటుపడ్డ వారికి ఎవరేమి చెప్పగలరు. చట్టాలు నిబం ధనలూ పరిస్థితులకు అనుగుణంగా మార్చినా ఎవరు పట్టించుకొనే స్థితిలో ఉన్నారు? పాతకాలపు సెక్షన్లు 30,144 సి.ఆర్.పి.సి కాగితాలలో, ప్రాథమిక రిపోర్టులలో, దర్యాప్తులలో వినవచ్చేవే. అంతకంటే వాటికి విలువనివ్వటం అనవసరం. ఎప్పుడో నిజానికి అవి అటకెక్కాయి. ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు, ఊరేగింపులలో దేవాలయాలల్లో, పుష్కరాలలో బహిరంగ సభలలో, జనసమూహాలు (Mob Psychology) ఎక్కడున్నా, తొక్కిస లాటలూ జరగటం సర్వసాధారణమయింది. ఇలాంటివాటిని అరికట్టి ప్రజల ప్రాణాలూ,గౌరవ జీవితాలనూ కాపాడటానికి మార్గాలు లేవా? ఎందుకు లేవు? క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, మొదట పాలకులు నేర్చుకోవాలి. అలనాడు జరిగిన రైల్వే ప్రమాదానికి కేంద్ర మంత్రి లాల్బహదూర్ శాస్త్రి తప్పుకున్నారు. అటు తర్వాత ఎందరో నాయకులు ప్రత్యక్ష బాధ్యత లేకపోయినా బాధ్యత నెత్తిమీద వేసుకొని మార్గదర్శకులుగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి దార్శనికత దుర్లభం అయింది. ప్రజల్లోంచి ప్రజా ప్రతినిధులోంచి పాల కుల్లోంచి అలాంటి మార్గదర్శకులు వచ్చినప్పుడే మానవ తప్పిదాలను అరికట్టడానికి ఈ ప్రజాస్వామ్యంలో రహదారి ఏర్పడుతుంది. అది సాధ్యమా? సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకున్న ఈకాలంలో ఆన్లైన్లో ఇలాంటి సమావేశాలు జరుపుకొని తమ సందేశాలను అదించి స్వీయ నియంత్రణ తో సక్రమంగా బాధ్యత నిర్వహించుకోవచ్చు కదా! ప్రజలు అప్పుడు క్రమశిక్షణకు కట్టుబడే అవకాశం ఉంటుందికదా!
-రావులపాటి సీతారాం రావు
జనసమూహ మనస్తత్వం ఏమిటి?
సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క జనసమూహ ప్రవర్తన సిద్ధాంతం ప్రధానంగా జనసమూహంలో సభ్యుడిగా మారడం వల్ల అపస్మారక మనస్సును అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనను కలిగి ఉంటుంది. ఇది సంభవిస్తుంది ఎందుకంటే సూపర్-అహం లేదా నైతిక స్పృహ కేంద్రం పెద్ద గుంపు ద్వారా స్థానభ్రంశం చెందుతుంది, దాని స్థానంలో ఆకర్షణీయమైన జనసమూహ నాయకుడు ఉంటాడు.
మూక మనస్తత్వం యొక్క శక్తి ఏమిటి?
మూక మనస్తత్వం అనేది మానవ ప్రవర్తనపై సామాజిక ప్రభావం యొక్క శక్తిని నొక్కి చెప్పే ఒక విస్తృతమైన దృగ్విషయం. ఇది హానికరమైన చర్యలకు దారితీయవచ్చు, దాని మానసిక మూలాలను అర్థం చేసుకోవడం వలన వ్యక్తులు తమ వ్యక్తిగత నమ్మకాలు, వైఖరులు మరియు చర్యలకు, గుంపులో కూడా నిజాయితీగా ఉండటానికి సహాయపడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: