ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 41మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కరూర్ తొక్కిసలాట తర్వాత టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన విజయ్(Vijay) రాకజీయ పర్యటనలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. గతనెల 27న కరూర్ లోని వేలుస్వామిపురంలో నిర్వహించిన టీవీకే బహిరంగ సభలో(public meeting)విజయ్ ని చూసేందుకు అభిమానులు,కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 41మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్ంచింది.
Mallikarjun Kharge INC : వైద్యుల పర్యవేక్షణలో ఖర్గే..

న్యాయం కోసం డిమాండ్లు
తొక్కిసలాటపై రాష్ట్రం ప్రభుత్వం, పోలీసుల నుండి తీవ్ర విమర్శలు ఎదురవడంతో పాటు, మృతుల కుటుంబాల నుంచి న్యాయం కోసం డిమాండ్లు పెరిగాయి. ఈ ఘటనకు బాధ్యులైన టీవీకే నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దీంతో భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపే ఉద్దేశంతో విజయ్ తన రాష్ట్ర పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత విజయ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, తన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయొద్దని, ఏదైనా ఉంటే తనను టార్గెట్ చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ను(Chief Minister Stalin) అభ్యర్థించారు. కరూర్ లో మాత్రమే ఈ విషాదం జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా మరణించిన వారి పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఇందులో మరణించిన వారిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిందని. దీంతో వారు మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు.
విజయ్ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి?
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత, ఆయన భద్రతా లోపాలపై దృష్టి పెట్టి, బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించారు.
కరూర్ ఘటన అంటే ఏమిటి?
ఇది విజయ్ పార్టీ సభలో జరిగిన తొక్కిసలాట (స్టాంపీడ్), దీనిలో కొందరు మరణించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: