కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), అస్వస్థతకు గురయ్యారు. 83 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ నేత జ్వరం, కాలు నొప్పి వల్ల ఆయన మంగళవారం ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఆయన వైద్యల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష కార్యాలయం, ఆస్పత్రి నుంచి హెల్త్ బులిటెన్ (Health Bulletin) వెలువడే అవకాశం ఉంది.
RBI repo : నిర్ణయంతో రుణదారులకు ఊరట లేకుండా పండుగ సీజన్
మంగళవారం (సెప్టెంబర్ 30) మల్లికార్జున ఖర్గే యథావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఉత్తర కర్ణాటక (Karnataka) లో జరిగిన భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని ఆయన కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి.
కళ్యాణ్ కర్ణాటకలో వరదలు, పంట నష్టానికి పరిహారం అందించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కి వివరణాత్మక లేఖ రాస్తానని కూడా ఆయన చెప్పారు.

మరోవైపు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) కళ్యాణ కర్ణాటకలో వరద పరిస్థితిని సమీక్షించి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి, పంటలు దెబ్బతిన్న వారికి ఎలాంటి పరిహారం ఇవ్వాలో కూడా ఆయన అధికారులకు సూచించారు.
అక్టోబర్ 7 మల్లికార్జున ఖర్గే నాగాలాండ్ (Nagaland) లో పర్యటించించాల్సి ఉంది. నాగా సోలిడారిటీ పార్క్‌లో జరిగే ర్యాలీకి ఆయన హాజరు కావాల్సి ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ స్థాయిల నేతలతో కీలక సమావేశాలను షెడ్యూల్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఈ పర్యటన ఉంటుందో లేదో అనే దానిపై సందిగ్ధం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: