తెలుగు చిత్రసీమలో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో ప్రభాస్ (Prabhas) వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన పెళ్లి ఎప్పుడవుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పటికీ ఉంటుంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తాజాగా స్పందించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి దర్శనం పూర్తి చేసిన తర్వాత మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని, ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటారని తెలిపారు.
News telugu: Diabetes-ప్రీడయాబెటిస్ లక్షణాలు ..?

ప్రభాస్ పెళ్లి (Prabhas Wedding) విషయంలో అమ్మవారికి కూడా ప్రత్యేకంగా మొక్కుకున్నట్లు శ్యామలాదేవి చెప్పారు. కుటుంబ సభ్యులంతా కూడా ప్రభాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడతారని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆయనకు ఉన్న సినిమా కట్టుబాట్ల కారణంగా పెళ్లి కొంత ఆలస్యమవుతుందని స్పష్టం చేశారు. అభిమానులు, మీడియా తరచూ ఈ విషయాన్ని అడుగుతున్నప్పటికీ సరైన సమయానికే ఈ సంతోషవార్త అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇక నిన్న విడుదలైన ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ ట్రైలర్ గురించి మాట్లాడుతూ, అది ఎంతో ఆకట్టుకునేలా ఉందని, సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని శ్యామలాదేవి ధీమా వ్యక్తం చేశారు. ప్రభాస్ నటనతో పాటు కథ కూడా కొత్తగా ఉండటంతో ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ప్రభాస్ పెళ్లి వార్తలతో పాటు కొత్త సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.