ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక పురోగతికి కేంద్రం మంజూరు చేసే పూర్వోదయ పథక నిధులు కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను కలిసి, ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
పూర్వోదయ పథకంలో ఏపీకి పెద్ద పట్టు కావాలని సీఎం అభ్యర్థన
దేశ తూర్పు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకంలో ఇప్పటికే బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను కూడా ఇందులో చేర్చిన నేపథ్యంలో, రాష్ట్రానికి తగిన నిధుల కేటాయింపు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ప్రాంతాలవారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం
చంద్రబాబు వినతిపత్రంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
- రాయలసీమ: హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించాలి
- ఉత్తరాంధ్ర: కాఫీ, జీడి, కొబ్బరి తోటల అభివృద్ధి
- కోస్తా ఆంధ్ర: ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించే ప్రాజెక్టులు
ఈ రంగాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు పూర్వోదయ నిధులు ఎంతగానో దోహదం చేస్తాయని సీఎం వివరించారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి భారీ నిధుల అవసరం
ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి ప్రాంతాలు ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని గుర్తించిన సీఎం, ఈ ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కి కేంద్రం అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకం ద్వారా వాటిని సమర్థవంతంగా అభివృద్ధి చేయవచ్చని ఆయన వివరించారు.
పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి మంత్రితో చర్చ
ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం, సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడీ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, తదితర నీటి పారుదల ప్రాజెక్టుల గురించి కేంద్రానికి వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: