हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Basic education – ‘ప్రాథమిక విద్య’కు గాంధీజీ పరిష్కారాలే శరణ్యం

Sudha
Latest Telugu news : Basic education – ‘ప్రాథమిక విద్య’కు గాంధీజీ పరిష్కారాలే శరణ్యం

స్వాతంత్ర్యం సముపార్జించుకొని 78 సంవత్సరాలు గడిచినా బ్రిటిష్ వారు రూపొందించిన విద్యా
“విధానమే నేటికి కొనసాగుతున్నది. విద్యారంగానికి మూలమైనది ప్రాథ మిక వ్యవస్థ. అది పటిష
వంతంగా ఉన్నప్పుడే యావత్ విద్యారంగం ఆదర్శవంతంగా, అభ్యుదయకరంగా ఉంటుంది. కానీ
ప్రధానమైన సమస్యలు నేటికీ కొనసాగడం విచార కరం బ్రిటిష్ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా మహాత్మా గాంధీజీ (Mahatma Gandhi) 1937లో బేసిక్ ఎడ్యుకేషన్ ‘నయీ తాలీమ్’ అనే నూతనవిద్యావిధానాన్ని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థను ప్రత్యక్షంగా అమలుచేయని కారణాన ప్రాథమిక విద్యా (Basic education) రంగంలో అతి మౌలికమైన, ప్రధానమైన సమస్యలు నేటికీ కొనసాగడం అత్యంత దురదృషకరం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ, ప్రాథమిక హక్కు అందించాల్సిన బాధ్యత రాజ్యం పై ఉందని పేరొనినా, ఉచిత నిర్బంధ విద్యాహక్కుకు బాలల హక్కు చట్టం 2009లో 35 ఆఫ్ 2009 రూపొం
దించినా అమలులో ఘోరంగా విఫలమయ్యాం. భారతదేశ అక్షరాస్యత రేటు 2023-24లో 80.9 మాత్రమే, ఇంకా మనదేశంలో 19.1 నిరక్షరాస్యులుగానే కొనసాగుతున్నారు. సాక్షర భారతం సాకారం చేసుకోలేకపోయాం. మనకన్నా అతి చిన్న వెనుకబడిన దేశాలు అండోర, గ్రీన్ లాండ్, నార్వే, లక్సెంబర్గ్, నార్త్ కొరియా, యుక్రెన్, యుజిబికి స్థాన్ మొదలగునవి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమైనది. మన దేశంలో చదువుకున్నందువల్ల పూర్తి ప్రయోజనం కలగడం లేదని, బతుకు తెరువు చూపడం లేదని. జీవనోపా ధికి తోడ్పడడం లేదని, నిత్య జీవితానికి ఉపయోగపడడం లేదనే
భావనతో పిల్లలు వివిధ దశలలో చదువుకు స్వస్తి చెప్పి నిరుద్యోగులుగానే కాదు నిష్ప్రయోజకులుగా
సమా జానికి భారంగా రూపొందుతున్నారు. మానవ జీవితం అత్యంత ఉన్నతమైనది, ఉద్దేశపూర్వకమైనది. భారతీయ సంస్కృతి సామాజిక నిబంధనలతో కూడిన వేల సంవత్స రాల ఆచారాలు, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల సమ్మేళనం. ఇది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెరిగిన ప్రాంతం, ఎదిగిన వాతావరణంలో అలవడుతుంది. ఒక వ్యక్తి భావనతో కూడి విలువల ప్రాధాన్యత వ్యక్తమవుతుంది. వారి ప్రవర్తన సంబంధాలు పెంపొందించి జీవితంలో ఉపయోగ పడతాయి. విద్యార్థులకు అలవడాల్సిన విలువలు సత్యము, సత్ప్రవర్తన, శాంతి, ప్రేమ, అహింస, నిజాయితీ, స
మైక్యత, సహకారం, క్రమశిక్షణ, సృజనాత్మకత, సేవా దృక్పథం మొదలగునవి. బాల్యంలోనే విలువలు అంకురిస్తాయి. తల్లిదండ్రులు సహాయకుల్ని చూసి, విని తెలుసుకొని ఎదుగుతాయి.

 Basic education -  'ప్రాథమిక విద్య'కు గాంధీజీ పరిష్కారాలే శరణ్యం
Basic education – ‘ప్రాథమిక విద్య’కు గాంధీజీ పరిష్కారాలే శరణ్యం

విస్తరిస్తున్న విష సంస్కృతి

ప్రస్తుతం విష సంస్కృతి విస్తరిస్తోంది. పిల్లలు నైతిక విలువలు కోల్పోయి విద్వేషాలు, వివక్షతలతో,
క్రమ శిక్షణరాహిత్యం, అవినీతి అక్రమాలు, అసత్యానికి అలవాటు పడి నీతీ బాహ్యా చర్యలకు
పాల్పడుతున్నారు, నేరస్తులుగా మారుతున్నారు. అత్యధిక తల్లిదండ్రులకు ఒకే సంతానంతో
అల్లారుముద్దుగా పెంచుతున్నారు. పిల్లల కోరికలుఎటువంటి వైనా తీర్చుతున్నారు. ఇప్పుడు పిల్లల
ప్రపంచాన్ని ట్యాబ్ లు టి.విలు ఆక్రమిస్తున్నాయి. ఆన్లైన్కు అడిక్ట్ అవుతున్నారు. స్మార్ట్ఫోన్లు, పోర్న్
సైట్లల అశ్లీలాన్ని చూసి పిల్లల మనసు లో విషం నింపుకొని, రేప్ లు, హత్యలు దొంగతనాలకు,
బ్యాంకు దోపిడీలలో పాల్గొంటూ పిల్లలు నేరస్తులుగా రూపొందుతున్నారు. పిల్లలకు సంస్కృతి, నైతిక
విలువలు ఇప్పుడు పాఠశాలలోనే ప్రారంభించాల్సి వస్తుంది. దీనికి తల్లిదండ్రులు సహకారం
అందించాలి. నైతిక విలువలు పెంపు జరగాల్సింది పాఠశాలలోనే, బోధించాల్సింది ఉపా
ధ్యాయులు. విలువలు అంటే వ్యక్తికి ప్రయోజనం కలిగిం చేలా ఇతరులకు హాని కలగకుండా
ఉండాలి. గాంధీజీ ప్రతి పాదించిన ఆదర్శ, ఆచరణాత్మక విద్యప్రబోధనలు, నిర్బంధ సార్వత్రిక
విద్య, మాతృభాషలోనే ప్రాథమిక విద్య(Basic education ), అక్షరాస్యత మాత్రమే కాదు స్వావలంబన, విద్య విలువల్నిపెం పొందించాలి, విద్య ద్వారా బాధ్యత గల పౌరునిగా పిల్లల్ని రూపొందించాలి, పిల్లల శారీరక,
మానసిక ఆత్మవిశ్వాసం అభివృద్ధికి తోడ్పడాలి. పని, విద్యా ద్వారా ఉత్వాధిక కార్య నననక్రమంలో
పని అనుభవం చేకూర్చి భావి జీవితానికి తోడ్ప డాలి. విద్యా స్వావలంబనకు అవకాశం కల్పించి
స్వతంత్రం గాను జీవనభృతి సాధించేలా ఉండాలి. మన విద్యా విధానం లో గాంధీజీ ప్రతిపాదించిన
విధానాలు ప్రత్యక్షంగా అమలు చేయలేదు కానీ భారతీయ విద్యా రంగంలో అమలుపర్చిన విధానం
పద్ధతులను గణనీయంగా ప్రభావితం చేశాయి. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు సర్వశిక్ష అభియాన్,
సమగ్ర శిక్షఅభియాన్, బాలల హక్కుచట్టం 2009 మొదలగు కార్యక్రమాలు చేపట్టినా సంపూర్ణంగా
సాధించకుండానే నిలిపివేశారు. భారత స్వాతంత్య్రం కఠినమైన ప్రస్థానంలో ఉంది. సమాజంలో అన్ని
విలువలు అణగారిపోతున్నవి గతంలో పాఠశాలల్లో మోరల్ పిరియడ్లు వారానికి ఒకటి రెండు
ఉండేవి. వాటిలో నీతి కథలు చెప్పెవారు. పాఠ్యాం శాలల్లో సుమతి, వేమన మొదలగు నీతి శతకాల
పద్యాలు బోధించేవారు వాటి ద్వారా నీతి బోధన జరిగేది భావి పౌరుల్ని ఉత్తమ విలువలతో రూ
పొందించాలి. రోజు రోజుకి విలువలు దిగజారుతున్న తరుణంలో ఉపాధ్యాయులు క్రియా శీల పాత్ర
వహించాలి. నైతిక విలువలను పిల్లలు నీతి కథ లు ద్వారానేర్చుకుంటారని టొరంటో విశ్వవిద్యాలయం పరి శోధనలో వెల్లడించడమైనది. మన దేశ నైతికసంపద పంచతంత్రం 50 భాష లకు అనువదించబడింది. వీటి ద్వారా సంస్కారమంతమైన సంపద, సంస్కృతి పలు దేశాల్లోలకు అనువదించబడింది. వీటి ద్వారా సంస్కారమంతమైన సంపద, సంస్కృతి పలు దేశాల్లో ప్రాచుర్యం పొంది, సంరక్షణకు ఇది తోడ్పడుతుంది. వీటిని మన పాఠ్యాంశాల్లో చేర్చాలి. పాఠశాలస్థాయిలో నీతి బోధ నకు ప్రతిరోజు ఒక పీరియడ్ కేటాయించాలి. నూతన సాంకే తిక పరిజ్ఞానంలోవచ్చిన కొత్త ఆవిష్కరణలు, నైపుణ్యాలు విధానాలను విద్యారంగంలో కూడా వినియోగించుకోవాలి.

 Basic education -  'ప్రాథమిక విద్య'కు గాంధీజీ పరిష్కారాలే శరణ్యం
Basic education – ‘ప్రాథమిక విద్య’కు గాంధీజీ పరిష్కారాలే శరణ్యం

అపరిష్కతంగా మౌలిక సమస్యలు

స్మార్ట్ఫోన్, డిజిటల్ టి.వి, కృత్రిమ మేధ, ప్రోగ్రామింగ్ మొదలగునవి సద్వినియోగం చేసుకుంటే
సౌలభ్యం, సౌక ర్యం, సౌగమ్యం, సౌముఖ్యం పరిజ్ఞానం మొదలగునవి సమకూరుతాయి. కానీ
పిల్లలు సెల్ఫోన్, టి.వి. మొదలగు వాటిని దుర్వినియోగం చేయడంతో దుష్ప్రవర్తన, హింస,
క్రమశిక్షణారాహిత్యం, చెడు విలువలు, దురాశ, దుర్మార్గాని కి, దొంగతనానికి, హత్యలకు పాల్పడడం
జరుగుతుంది. పిల్లలు సెల్ఫోన్లు, ట్యాబ్లు వినియోగించకుండా కాపాడాలి లేదా పర్యవేక్షణలో
వినియోగించేలా చూడాలి. దీనికి తల్లిదండ్రుల సహకారం స్వీకరించాలి. గాంధీజీ ప్రతిపాదించిన పని
విద్యను ప్రత్యక్షంగా అమలు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం నియమించిన వివిధ కమీషన్లు,
కమిటీలు కొఠారి కమిషన్ (6466) ఈశ్వరీ బాబు పటేల్ కమిటీ (1977) మాల్కం ఆదిశేషయ్య
కమిటీ (1977) వి.ఆర్. రెడ్డి కమిటీ (1980) పని విద్యకు ప్రాముఖ్యత కల్పించాలని, పాఠ్యాంశాల్లో
భాగంగా ఉండాలని, వారానికి 6 గంటలు కేటాయించాలని సిఫార్సు చేసినా, సిఫార్సులు
కాగితాలతో పరిమితం అయ్యాయి కానీ అమలుకు నోచుకోలేదు. గాంధీజీ ప్రతిపాదించిన విద్యా
విధానాన్ని స్వాతంత్ర్యం సమపార్జ నంతరం అమలుపరిస్తే ఏనాడో మన దేశం సంపూర్ణ అక్ష రాస్యత
సాధించి అభివృద్ధి చెందిన దేశాల సరసననిలిచేది. విద్యార్థుల్లో విలువలు అభివృద్ధి చెంది నేటి విష
సంస్కృతి విస్తరించేది కాదు. పని విద్య అమలుపరచడం ద్వారా పిల్ల లకు పని పట్ల గౌరవం
సమకూరేది. నిరుద్యోగ నిర్మూలనకు తోడ్పడేది చదువుతో పూర్తిప్రయోజనం పొందేవారు “మాతృ భాష
లోనే ప్రాథమిక విద్యా (Basic education )బోధన అని నిర్దుష్టంగా సిఫా రసు చేసినందున కొనసాగుతున్న వివాదానికిఏనాడో పరి ష్కారం చేకూరేది. స్వాతంత్య్రానంతరం ప్రాథమిక విద్యా రంగ ప్రాముఖ్యత గుర్తించి
ఎన్నో కమిషన్లు కమిటీలు వేసినా మరెన్నో సిఫార్సులు చేసిన మౌలిక సమస్యలు నేటికీ అపరిష్క
తంగానే ఉన్నవి. గాంధీజీ ప్రతిపాదించిన విద్యా విధానం నిర్దిష్టంగా, నిర్మాణాత్మకంగా అమలు
పరిస్తే మౌలిక సమస్యల్ని పరిష్కృతమై అత్యంత కీలకమైన ప్రాథమిక విద్యారంగం సమాజ
సంరక్షణకు అభివృద్ధికి తోడ్పడి భాసిల్లే అవకాశం సమకూరుతుంది.
-కొల్లు మధుసూదన రావు

భారతదేశంలో ప్రాథమిక విద్య ఏమిటి?

భారతదేశంలో ప్రాథమిక విద్య లేదా ప్రాథమిక విద్య 8 సంవత్సరాలు ఉంటుంది . 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు ఈ క్రింది 2 దశలను పూర్తి చేస్తారు: ప్రాథమిక దశ, గ్రేడ్ IV; ఉన్నత ప్రాథమిక దశ, గ్రేడ్ VI-VIII.

ప్రాథమిక విద్యను ఎవరు ప్రారంభించారు?

మహాత్మా గాంధీ 1937లో తన వార్తాపత్రిక ‘హరిజన్’లో చక్కగా రూపొందించబడిన విద్య విధానంలో ప్రాథమిక విద్య (నై తాలిమ్) పథకాన్ని ప్రతిపాదించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870