తమిళనాడులోని కరూర్(Karur)లో ఇటీవల జరిగిన ప్రచార సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు దారితీసింది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ హేమమాలిని తీవ్ర స్పందన తెలియజేశారు. బాధితులను పరామర్శించేందుకు ఆమె నేతృత్వంలోని బీజేపీ ఎంపీలు ఘటనాస్థలాన్ని సందర్శించారు.
బాధిత కుటుంబాలతో మానసికంగా దగ్గరగా
“ఏం జరిగిందో వారికి దగ్గరగా తెలుసుకున్నాం” – హేమమాలిని (Hema Malini)ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం, హేమమాలిని మాట్లాడుతూ, “బాధిత కుటుంబాలతో మాట్లాడి, వారి బాధలు విన్నాం. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత కోసం పరిశీలన చేపట్టాం” అని అన్నారు. ఈ ఘటన విన్నపుడు తాను చాలా బాధపడినట్లు తెలిపారు.
స్టార్ హీరో సభకు ఇరుకైన వేదిక ఎంపికపై తీవ్ర అసంతృప్తి
విజయ్ ప్రచార సభకు ఇరుకైన ప్రాంగణాన్ని ఎంపిక చేయడాన్ని హేమమాలిని తీవ్రంగా తప్పుబట్టారు. “ఇలాంటి స్టార్ హీరో సభకు సరైన స్థలం లేకుండా కార్యక్రమం నిర్వహించడం వల్లే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటువంటి దారుణ ఘటనలు గతంలో రాజకీయ సభల్లో చాలా అరుదుగా కనిపించాయి” అని అన్నారు.
కరెంట్ కట్, వ్యాసంగ వేదికపై అనుమానాలు
హేమమాలిని మాట్లాడుతూ, సభ జరిగిన ప్రాంతంలో కరెంట్ కట్, ఇరుకైన స్థలం, అసమర్ధ ఏర్పాట్లు అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సక్రమంగా ప్రణాళికలు రచించి విశాల ప్రాంగణాన్ని కేటాయించి ఉంటే ఈ ఘటనను నివారించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
తమిళనాడు పోలీసులపై విమర్శలు – అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు
ఈ ఘటనపై మరో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, తమిళనాడు పోలీసు శాఖ ఏర్పాట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఒక ప్రముఖ నాయకుడి సభ అంటే భారీ సంఖ్యలో జనాలు వస్తారని ముందుగా అంచనా వేసి ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం – హేమమాలిని హామీ
హేమమాలిని మాట్లాడుతూ, ఈ ఘటనలో గాయపడిన వారికి వైద్య సహాయం అందుతోందని, మరింత మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితుల కుటుంబాలకు ఆర్థికంగా, మానసికంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: