हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Kavitha: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

Anusha
Latest News: Kavitha: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఇటీవల కొత్త పార్టీ ఏర్పాటు ఆసక్తి వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంపై మీడియా వర్గాల నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోలేదని, అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని వ్యాఖ్యానించారు.

TG Local Body Elections : మహిళలకు 15 జడ్పీ ఛైర్మన్ స్థానాలు

లండన్‌ (London) లోని తెలంగాణ ప్రవాసులతో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ని దేశానికి రోల్ మోడల్‌గా నిలపాలన్నదే తన సంకల్పమని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం తమ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు.ఈ వ్యాఖ్యలతో ప్రజలలో ఒకవిధమైన అంచనాలు ఏర్పడినప్పటికీ, ఆమె ప్రధానంగా తెలంగాణ జాగృతి సంస్థపై దృష్టి సారించడానికి సంకల్పబద్ధంగా ఉన్నారు.

ప్రజల జీవితాల్లో మార్పు తేవడంపై

ప్రజల జీవితాల్లో మార్పు తేవడంపై తమకు స్పష్టమైన ఆలోచన ఉందని కవిత అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, తనకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని కవిత అన్నారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని కవిత పునరుద్ఘాటించారు.

Kavitha
Kavitha

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, తెలంగాణ (Telangana) ను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. ఇక బీజేపీ డీఎన్ఏ తనకు సరిపడదని తెలిపారు.ఇరవై ఏళ్లు పార్టీ కోసం పని చేశానని కవిత తెలిపారు. కొందరిలో స్వార్థం పురుడుపోసుకుందని, వారి వల్ల కోట్లాది మంది బాధపడవద్దనే తన తపన అన్నారు. పార్టీలో చీలికలు రావొద్దనే ఎంతటి ఇబ్బందినైనా తట్టుకొని నిలబడ్డానని, పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు

తన ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయని ఆమె ఆరోపణలు చేశారు.తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ తర్వాత మాట్లాడవలసి వచ్చిందని కవిత అన్నారు. పార్టీ తనను వద్దుకున్నదని, అందుకే పార్టీ ఇచ్చిన పదవిని వదులుకున్నానని కవిత అన్నారు.

కష్టమవుతుందని తెలిసినా కేసీఆర్ (KCR) బిడ్డగా ధైర్యంగా పంథాను ఎంచుకుంటానని కవిత అన్నారు. జైలు జీవితం తనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని కవిత అన్నారు. నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పనిచేయాలని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870