ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఎన్నో సంవత్సరాలు సేవలందించిన సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) (36) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోమవారం ఆయన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించి, తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాడు. దీంతో ఇకపై ఆయన ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ వేదికపై కనిపించరని అభిమానులకు స్పష్టమైంది.
Asia Cup 2025: టీమిండియా విజయంపై పవన్ కల్యాణ్ హర్షం
రెండు ప్రపంచకప్ లు గెలవడంలో కీలక పాత్ర
ఇంగ్లండ్ (England) రెండు ప్రపంచకప్ లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వోక్స్, ఇకపై అంతర్జాతీయ వేదికపై కనిపించబోనని ప్రకటించాడు. అయితే, కౌంటీ క్రికెట్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ (Franchise Leagues) లో ఆడటం కొనసాగిస్తానని తెలిపాడు.ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో వోక్స్ ఒక భావోద్వేగ ప్రకటనను విడుదల చేశాడు.
“అంతర్జాతీయ క్రికెట్ (International cricket) నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు పెరట్లో ఆడుకుంటూ, ఇంగ్లండ్ కు ఆడాలని కలలు కన్నాను. ఆ కలలను నిజం చేసుకున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
యాషెస్ సిరీస్ లలో భాగం కావడం ఎప్పటికీ
గత 15 ఏళ్లుగా ఇంగ్లండ్ జెర్సీ (England jersey) ధరించి, నా సహచరులతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నాడు. రెండు ప్రపంచకప్ లు గెలవడం, ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లలో భాగం కావడం ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలని తెలిపాడు. తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, కోచ్ లకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వోక్స్, ఇంగ్లండ్ తరఫున మొత్తం 217 మ్యాచ్ లు ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్ (2019 ODI World Cup) ఫైనల్ లో న్యూజిలాండ్ పై మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ
అలాగే 2022లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్ లో 62 టెస్టులు ఆడి 192 వికెట్లు పడగొట్టడంతో పాటు, 2018లో లార్డ్స్ వేదికగా భారత్ పై ఒక సెంచరీ కూడా సాధించాడు. ఇక 122 వన్డేల్లో 173 వికెట్లు, 33 టీ20 మ్యాచ్ లలో 31 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
వోక్స్ రిటైర్మెంట్ పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ (Richard Thompson) స్పందించారు. “వోక్స్ ఒక జెంటిల్మన్. జట్టు కోసం ఎంతగా తపించేవాడో చెప్పడానికి ఈ వేసవిలో చేతికి గాయమైనా బ్యాటింగ్ కు రావడం ఒక ఉదాహరణ.
2019, 2022 ప్రపంచకప్ లలో బంతితో అద్భుతాలు చేశాడు. గత ఏడాది యాషెస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి జట్టుకు గొప్ప సేవలందించాడు. ఇంగ్లండ్ క్రికెట్ కు అతను చేసిన సేవలకు ధన్యవాదాలు” అని థాంప్సన్ కొనియాడారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: