యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeet) ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయన, తరువాత ప్రభాస్‌తో చేసిన ‘సాహో’తో పాన్ ఇండియా స్థాయి దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగు ప్రేక్షకులందరికీ ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోయినా,హిందీ లో హిట్ అయ్యింది.
Bigg Boss 9: హౌస్ నుండి బయటకు వచ్చేసిన ప్రియా శెట్టి
ప్రత్యేకంగా, తొలి రోజు 100 కోట్లు కలెక్షన్లు సాధించడం ద్వారా రెబల్ స్టార్ (Rebel Star Prabhas) స్టామినాని నిరూపించడమే కాక, సుజీత్ తన దర్శకపటుత్వాన్ని కూడా చూపించారు.తాజాగా పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ తీసిన సుజీత్ ఫస్ట్ డే రూ.100 కోట్ల ఫీట్‌ని మరోసారి అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు సినిమాలతో ఫస్ట్ డే రూ.100 కోట్లు రాబట్టిన రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్‌ల సరసన చేరాడు.
‘ఓజీ’ మూడు రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్ చేరడంతో సుజీత్ పేరు మార్మోగిపోతోంది. ఈ చిత్రంలో పవన్‌ని ఆయన చూపించిన విధానం, స్టైలిష్ మేకింగ్, డిఫరెండ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి. ‘ఓజీ’ సూపర్ సక్సెస్‌తో సుజీత్ నెక్ట్స్ సినిమాపై అందరి దృష్టి పడింది.
ప్రస్తుతం ‘ఓజీ’ సక్సెస్‌ని ఎంజాయ్ ఛేస్తోన్న సుజీత్
సుజీత్ ఇప్పటికే నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) తో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించి సెట్టింగ్స్ పూర్తయి సెట్స్ మీదికి వెళ్లేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ‘ఓజీ’ సక్సెస్‌ని ఎంజాయ్ ఛేస్తోన్న సుజీత్ త్వరలోనే ఆ చిత్రాన్ని మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే న్యూస్ బయటికొచ్చింది.ఇందులో నానికి విలన్‌గా మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ని దించుతున్నాడట. ఇప్పటికే ఆయనకు కథ వినిపించగా క్యారెక్టర్ నచ్చడంతో విలన్‌గా నటించేందుకు పృథ్వీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సుజీత్ ఓజీ ఫార్ములానే ఫాలో అవుతున్నాడని
ఈ వార్త తెలిసిన వారంతా సుజీత్ ఓజీ ఫార్ములానే ఫాలో అవుతున్నాడని అంటున్నారు.బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ని ఓజీలో విలన్‌గా తీసుకోగా.. ఆయన తన స్టైలిష్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు.
ఇమ్రాన్‌లో ఈ కోణాన్ని ఇప్పటివరకు బాలీవుడ్ మేకర్స్ ఎందుకు చూడలేదని చాలామంది కామెంట్స్ చేశారు.బాలీవుడ్ విలన్ని టాలీవుడ్లో విలన్‌గా చూపించడం సక్సెస్ కావడంతో ఇప్పుడు సుజీత్ మలయాళ స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్‌ని ప్రతి నాయకుడిగా చూపించేందుకు సిద్ధమయ్యాడు.
లూసిఫర్, జనగణమని, లూసిఫర్ 2, సలార్.. చిత్రాలతో పృథ్వీరాజ్ నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తీసుకుంటే చిత్రానికి మరింత హైప్ వస్తుందని సుజీత్ ప్లాన్‌గా తెలుస్తోంది. పృథ్వీ ప్రస్తుతం రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: