విజయవాడ : అరకు కాఫీకి ‘ఛేంజ్మేకర్ ఆఫ్ ది ఇయర్'(Changemaker of the Year)‘ అవార్డు లభించింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డు, అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు పట్ల సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. అరకు వ్యాలీ కాఫీ మరో ఘనత సాధించిందని పేర్కొన్నారు.
Read Also: Flood Warning:ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

‘ఛేంజ్మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించడం శుభపరిణామం అని చెప్పారు. ఫైనాన్షియల్ ట్రాన్స్ ఫర్మేషన్ విభాగంలో ఇది దక్కిందని పేర్కొన్నారు. గిరిజన రైతుల కృషితో బలమైన సామాజిక స్థానం సాధ్యమైందన్నారు. అరకు కాఫీ(Araku Coffee) తోటల సాగులో గిరిజన రైతులు అవిశ్రాంతంగా, అంకితభావంతో కృషి చేశారని ప్రశంసించారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు స్థిరమైన ఆదాయాలను పొందుతున్నారని చెప్పుకొ చ్చారు. ప్రపంచ స్థాయీ గుర్తింపును సాధించారని కొనియాడారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: