Today gold : సెప్టెంబర్ 29న బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,520కి చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల (Today gold) బంగారం ధర రూ. 1,05,210గా ఉంది. వెండి ధర కూడా పెరిగి కిలోకు రూ. 1,39,500 వద్ద కొనసాగుతోంది.
నిన్నతో పోలిస్తే నేడు పసిడి ధరల్లో కొద్దిపాటి పెరుగుదల కనిపించింది. గత కొంతకాలంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డాలర్ విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి వాతావరణం కొనసాగడం వలన బంగారం ధరలు ఎగబాకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Read also : ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపు
ఫెస్టివల్ సీజన్ కొనసాగుతున్నప్పటికీ, అధిక ధరల కారణంగా నగలు కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిపోయిందని జువెలరీ షాపులు చెబుతున్నాయి. గత సంవత్సరం తో పోలిస్తే బంగారం ధరలు దాదాపు 45 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భద్రంగా ఉంచుకోవడానికి బంగారాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం మళ్లీ ఒక సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిందని నిపుణుల అభిప్రాయం.
Read also :