శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరిగే గరుడ సేవకు భక్తులు అంచనాలను మించి భారీ సంఖ్యలో తరలిరావడంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. భారీ జనసందోహం కారణంగా రద్దీ నియంత్రణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయ ప్రకారం, తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

ప్రైవేట్ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ తీవ్ర స్థాయిలో నిలిచిపోవడం
తిరుమల కొండపై చేరుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులను మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అలిపిరి వద్ద వేలాది ప్రైవేట్ వాహనాలు (Private vehicles)నిలిచిపోయాయి. ఫలితంగా తిరుపతిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుండి గరుడ సర్కిల్ వరకు ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. ఇప్పటికే తిరుమల పరిధిలోని పార్కింగ్ ప్రదేశాలు సుమారు 4,000 వాహనాలతో నిండిపోయాయని సమాచారం అందింది.
భక్తుల రద్దీతో తిరుమల వీధుల్లో ఘర్షణలు
గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తిరుమలకు చేరుకోవడం వల్ల తిరుమాడ వీధుల గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. ఈ భారీ జనసంద్రం కారణంగా గ్యాలరీలు పూర్తిగా కిక్కిరిసిపోవడంతో, భక్తులను మాడ వీధుల్లోకి అనుమతించడం లేదు. నందకం, రామ్ భగీచా, లేపాక్షి సర్కిళ్ల వరకు భక్తుల రద్దీ బారులు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: