రామ్ చరణ్… ఈ పేరు తెలుగు సినిమా లోనే కాకుండా భారత సినీ పరిశ్రమలోనే ఒక బ్రాండ్ గా ఉంది. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈరోజు తన సినీ ప్రయాణంలో 18 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంలో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, సినీ రంగంలోని వర్గాలు ఎక్కడ చూసినా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Kantara Chapter 1 : కాంతార నుంచి కొత్త సాంగ్ విడుదల
‘చిరుత’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, తన 18 ఏళ్ల కెరీర్లో ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ వంటి బ్లాక్బస్టర్లతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో పెద్ది అనే సినిమాతో చేస్తున్నాడు.
అయితే రామ్ చరణ్ 18 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ది (Peddhi movie) నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.ఈ పోస్టర్లో రామ్ చరణ్ రస్టిక్ లుక్‌లో గడ్డం, మాసిన జుట్టుతో చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. నల్లటి అంగీ, ఎర్రటి చారల చొక్కా ధరించి, ముక్కుకు పోగుతో,
బీడీ తాగుతూ చాలా ఇంటెన్స్ లుక్‌లో రామ్ చరణ్ దర్శనం ఇచ్చారు ఈ పోస్టర్ సినిమా కథ నేపథ్యాన్ని, చరణ్ పాత్ర శక్తిని సూచిస్తూ ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ పనిచేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: