हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Karur stampede: తొక్కిసలాట ఘటన.. విజయ్‌పై నటుడు శరత్‌కుమార్ ఆగ్రహం

Anusha
Latest News: Karur stampede: తొక్కిసలాట ఘటన.. విజయ్‌పై నటుడు శరత్‌కుమార్ ఆగ్రహం

కరూర్ జిల్లాలో (Karur stampede) జరిగిన రాయలీ ఘటనా మరువలేనిది. తమిళనాడులోని టీవీకే పార్టీ  ((TVK) Party)  అధినేత విజయ్   (Vijay) నిర్వహించిన ప్రచార ర్యాలీ సమయంలో ఘోరమైన తొక్కిసలాట ఏర్పడింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలను కోల్పోయారని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అయితే, ఆ తరువాత మరికొందరు మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి, ఇలాంటి పరిణామాలతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చనే భయం వ్యక్తమవుతోంది. అదనంగా, 50 మందికి పైగా మంది గాయపడి, కొందరు అత్యవసర పరిస్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

 Karur stampede: తొక్కిసలాట.. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?.. సీఎం స్టాలిన్ ఏమన్నారంటే..!

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సహాయచర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్టాలిన్ (CM Stalin) అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆదివారం ఉదయం కరూర్ చేరుకున్న ఆయన క్షతగాత్రులను పరామర్శించారు.

తొక్కిసలాట ఘటనపై విచారించేందుకు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్ (Retired Judge Aruna Jagadeesan) ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు.ప్రచార ర్యాలీ షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలు కావాల్సి ఉండగా విజయ్ ఏడు గంటలు ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై విజయ్ స్పందిస్తూ

ఈ నేపథ్యంలోనే నీరు, ఆహారం లేక అనేక మంది కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. ఇక విజయ్ మాట్లాడుతున్నప్పుడు తొక్కిసలాట (Stampede) జరగ్గా అంబులెన్స్ వెళ్లే దారిలేక ప్రాణ నష్టం పెరిగింది. అంతకుముందు విజయ్ రెండుసార్లు ప్రసంగాన్ని ఆపాడు. ఒకసారి మంచినీళ్ల కోసం, మరోసారి ఆ జనంలో తప్పిపోయిన చిన్నారి కోసం ప్రసంగాన్ని ఆపాడు.

Karur stampede
Karur stampede

ఈ గందరగోళం వల్ల తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విజయ్ స్పందిస్తూ.. ‘నా హృదయం బరువెక్కింది, భరించలేని, మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను. కరూరులో మరణించిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నా. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని

ఈ ఘటనకు సంబంధించి విజయ్‌పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 40 మందిని పొట్టన పెట్టుకున్న ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని సోషల్‌మీడియా ద్వారా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు శరత్‌కుమార్ (Actor Sarathkumar) ఈ ఘటనపై స్పందించారు. ‘తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని చూసి తట్టుకోలేకపోతున్నాను.

ఈ బాధని తట్టుకునే శక్తిని దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన గురించి తెలియగానే నా రక్తం మరిగింది. విదేశాల్లో ఉండటంతో నేను నేరుగా వచ్చి బాధితుల్ని పరామర్శించలేకపోతున్నాను.

ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం

ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ మరణాలకు పూర్తి బాధ్యత విజయ్‌దే. పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగింది’ అని శరత్‌ కుమార్ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870