తిరుమల బ్రహ్మోత్సవాల్లో(Tirumala Brahmotsavam 2025) అత్యంత ప్రాధాన్యమున్న గరుడ వాహన సేవ నేడు వైభవంగా జరగనుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది తిరుమలకు చేరుకుని స్వామి వాహన సేవను దర్శించుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఈసారి 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
Breaking News – Warning : నదీ పరీవాహక ప్రజలు జాగ్రత్త – APSDMA
భక్తుల సౌకర్యార్థం టీటీడీ (TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. మాడ వీధుల గ్యాలరీలతో పాటు, తిరుమలలోని 36 ప్రదేశాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడ ఉన్నా స్వామి వాహన సేవను వీక్షించే అవకాశం కల్పించారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లు వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది, వాలంటీర్లు క్యూలైన్లలో భక్తుల రద్దీని సజావుగా నిర్వహిస్తున్నారు.

ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బ్రహ్మోత్సవాల ఐదో రోజు మహా చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ప్రత్యేక దర్శనానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ పర్వదినాల్లో భక్తుల భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం రెండు చోట్లా ఉత్సాహభరితంగా కనిపిస్తున్నాయి.