ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings)శనివారం విజయవంతంగా ముగిశాయి. ఎనిమిది రోజులపాటు కొనసాగిన ఈ సమావేశాల అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వి. అయ్యన్న పాత్రుడు అధికారికంగా ప్రకటించారు.
23 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం – మూడు బిల్లులు వెనక్కి
ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 23 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, వాటిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది సమావేశాల ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. అయితే, మరొక మూడు బిల్లులను (Three bills)ప్రభుత్వం స్వయంగా వెనక్కి తీసుకుంది, ఆ బిల్లులపై పునఃపరిశీలన జరిపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.ఈ సమావేశాలు మొత్తం 8 రోజుల పాటు 45 గంటల 53 నిమిషాల పాటు కొనసాగాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు.ఆర్థిక వ్యవస్థ పరిపాలన,ప్రజా సంక్షేమం,లాంటీ అరు ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సభ్యులందరూ చురుకుగా పాల్గొనడం వల్ల సభ ప్రక్రియ సజావుగా కొనసాగింది.
స్పీకర్ వ్యాఖ్యలు: ఏకగ్రీవ ఆమోదానికి ప్రశంస
సభ ముగింపు సందర్భంగా స్పీకర్ వి. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ,
“ప్రవేశపెట్టిన అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం గమనార్హం. సభను ప్రస్తుతం నిరవధికంగా వాయిదా వేస్తున్నాం,” అని వెల్లడించారు.అయన ప్రకటన సభ వాతావరణాన్ని ముగింపు దశకు తీసుకెళ్లింది.
జగన్ గైర్హాజరు – రాజకీయ చర్చకు దారితీసిన అంశం
ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనకపోవడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్య నేతగా ఉండి మొదటి సమావేశాలకు హాజరుకాలేకపోవడం పై విమర్శలు, చర్చలు జరిగాయి.విపక్షాలు దీనిని పెద్ద అంశంగా తీసుకుని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.తదుపరి సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్తో పాటు మరిన్ని కీలక విధానాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: