
ర్యాగింగ్ పై చిన్న కోర్టుల నుంచి పెద్ద కోర్టుల వరకు ఎన్నో చట్టాలు చేశాయి. ప్రభుత్వం కూడా ర్యాగింగ్ అంతానికి కఠిన చర్యలకు పాల్పడుతున్నా ఇంకా అక్కడక్కడ ఈ భూతం వదలడం లేదు. తిరుపతిలోని సత్యవీడు సిద్ధార్థ కాలేజీ హాస్టల్ ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు(students) విచక్షణారహితంగా చితకబాదారు.
Read Also: Jagan: హైకోర్టు ఆదేశాలపై జగన్ హర్షం
కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డు(Record) చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కాలేజీ బీజేపీ నేతకు చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. ర్యాగింగ్ భూతానికి ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ర్యాగింగ్ ను నిరోధించేందుకు కఠిన చట్టాలను తీసుకొచ్చారు. కోర్టులు కూడా కఠిన తీర్పులను ఇస్తున్నది.
దీంతో చాలావరకు ఈ ర్యాగింగ్ విధానం తగ్గింది. ఈ వీడియోను చూస్తుంటే ఇంకా అక్కడకకడా ర్యాగింగ్ జరుగుతున్నాయనేందుకు ఈ సంఘటన రుజువు చేస్తున్నది. అధికారులు దీనిపై స్పందించి సదరు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని బాధిత పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ర్యాగింగ్ పేరుతో ఇలాంటి కీచక చర్యలు కరెక్టేనా?
తిరుపతిలో ర్యాగింగ్ ఘటన ఎక్కడ జరిగింది?
సత్యవీడు సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది.
బాధిత విద్యార్థికి ఏం చేశారు?
తోటి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు, కాళ్లతో తన్నారు, దాడి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: