టాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ప్రొడక్షన్ (ETV Win Production) లో రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ దూసుకెళ్లింది.
The Paradise Movie: ది ప్యారడైజ్.. మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల
ఈ సినిమా ఓటీటీ తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి సూపర్‌హిట్‌ను అందుకుంది. తాజాగా ఈ చిత్రం (Little Hearts OTT) ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (ETV Win) వేదికగా అక్టోబర్ 01 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: