విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. జగన్ (jagan)ను ఉద్దేశించి సైకోగాడు. అనడం, చిరంజీవిని అవమానించారనడం ఈ ప్రభుత్వంలో కూడా తనకు గౌరవం ఇవ్వలేదనడం ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్లను అవమానపరిచారనే దానిపై మొదలైన రగడ ఇప్పుడు. కూటమిలో కుంపట్లకు కారణమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో వీటిని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణాలకు ఏర్పడింది.

మెగాస్టార్ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం
సినిమా వాళ్లు జగన ను కలిసేందుకు వెళ్లినప్పుడు మొదట ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని, చిరంజీవి గట్టిగా అడగడంతో ఆయన దిగి వచ్చారని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. అయితే బాలకృష్ణ ఈ విషయాన్ని ఖండించారు. అప్పుడెవరూ గట్టిగా అడగలేదన్నారు. అయితే చిరంజీవికి అవమానం జరిగిన మాట మాత్రం వాస్తవం అన్నారు. అయితే చిరంజీవి(Chiranjeevi)ని అంతమాట అంటావా అని ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ మానసికస్థితి సరిగ్గా లేదంటూ వారు కొన్ని ధ్రువీకరణ పత్రాలు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి తమ్ముడు నాగబాబు కుడా మనస్తాపానికి గురైనట్లు జనసేన వర్గాల సమాచారం. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ దశాబ్దాలుగా ఉంది. ఇప్పుడు కూడా అది కనిపించింది. కూటమి ప్రభుత్వంలో ఎఫ్ఎసీ సమావేశానికి రూపొందించిన జాబితాలో తనను 9వ స్థానంలో ఉంచడంపైన కూడా బాలకృష్ణ అగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో తెలీదా అని బాలయ్య ప్రశ్నించారు. ఈ లిస్ట్ ఎవడు రెడీ చేశాడంటూ మంత్రి కందుల దుర్గేశను అడిగినట్లు కూడా ఆయన చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇది టిడిపి, జనసేన మధ్య విభేదాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం మరో 10-15 ఏళ్లు కొనసాగాలి
కూటమి ప్రభుత్వం మరో 10-15 ఏళ్లు కొనసాగాలని ఆటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ కామెంట్స్ సహజంగానే ఆ రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంలో చిరంజీవి భాగస్వామి కాకపోయినా ఆయన సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు కీలకంగా ఉన్నారు. కందుల దుర్గేశ్ కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తే ఇప్పుడు వీళ్లందరినీ బాలకృష్ణ చిక్కుల్లో పడేశారు. ఈ చిక్కుముడులను విప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై పడింది. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉందని వైసీపీ మాజీ ఎంపి మార్గాని భరత్ అన్నారు. సినిమా ఫంక్షన్లకు ‘పుచ్చుకొని’ వెళ్ళినట్లు అసెంబ్లీకి వచ్చావా? అని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట తీరు, వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు. నెత్తి మీద విగ్గు, దానిమీద గాగుల్స్, జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారు. బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేయించాలన్నారు. ఆయన మాట తడబడుతూ మాట్లాడుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు గురు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా హెలికాప్టర్లలో తిరుగుతుండటం వాలకృష్ణ చూడలేకపోతున్నాడు. తన బావ చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ జామర్ కార్లలో తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. పవన్కు చంద్రబాబు ఒంగిఒంగి సరామ్ కొడుతుంటే కుతకుత లాడిపోతున్నాడు. బాలకృష్ణ వల్ల అసెంబ్లీ గేటు దగ్గర కూడా బ్రీత్ ఎనలైజర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన తప్పతాగి కళ్లునెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. అసలు సైకో బాలకృష్ణ. పవన్ కల్యాణ్ను చూసి తట్టుకోలేని సైకో బాలకృష్ణ అంటూ పేర్నినాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలకృష్ణకు పేర్శినాని సవాల్
బాలకృష్ణ స్వయంగా నాతో ఫోన్లో మాట్లాడారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా దమ్ముంటే నువ్వు నీ తల్లిదండ్రులపై ప్రమాణం చెయ్యి… అంటూ బాలకృష్ణకు పేర్శినాని సవాల్ చేశారు. నందమూరి తారకరామారావు, బసవతారకం ఎంత గొప్ప వ్యక్తులు. అలాంటి వారి కడుపున పుట్టిన నువ్వు ఇంతలా దిగజారిపోవడం సిగ్గువేటు, అఖండ సినిమా కోసం బాలకృష్ణ నాకు స్వయంగా ఫోన్ చేశాడు. జగన్ మోహన్ రెడ్డితో అపాయింట్ మెంట్ ఇప్పించండి అని అడిగారు. బాలకృష్ణ ఫోన్ చేస్తే నేనే జగన్ మోహన్ రెడ్డికి విషయం చెప్పాను. వాళ్లు ఏ సాయం అడిగితే అది చేసి పెట్టమని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్ని నాని అన్నారు. వైఎస్సార్ ఎంత సాయం చేశాడో. మర్చిపోయావా బాలకృష్ణ..? యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకున్న విషయం గుర్తు లేదా.. మనిషి జన్మ ఎత్తినవాడెవరైనా చేసిన సాయం మర్చిపోతాడా. జగన్మోహన్ రెడ్డిని కలవడం ఇష్టం లేకపోతే రావడం మానేయండి, అంతేకానీ ఎందుకు ఈ సైకో మాటలు అంటూ బాలకృష్ణపై పేర్శినాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క వైకాంగ్రెస్పార్టీ నేతల. విమర్శలను టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో తిప్పికొడుతున్నారు. కొందరు బాలకృష్ణ అభిమానులు చిరంజీవి అభిమానులపై సామాజిక మాధ్యమాల్లో ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయంగాను, చలనచిత్ర రంగంలో బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: