విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో(industrial sector) అనూహ్యంగా బలోపేతం అవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గత ప్రభుత్వం సాధించిన దానికంటే మూడు రెట్ల మేర పెట్టుబడులు సాధించామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 125 ప్రాజెక్టుల్లో రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఆర్‌సెలార్ మిట్టల్, భారత్ పెట్రోలియం, ఎల్ అండ్ టీ, ఐబీఎం, టీసీఎస్, గూగుల్, ఎన్టీపీసీ, రిలయన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.
Gold price : నవరాత్రి ఆరవ రోజు బంగారం, వెండి తాజా రేట్లు
లాజిస్టిక్స్, రవాణా రంగాలపై సీఎం దృష్టి
లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వస్తు, ప్రయాణికుల రవాణా మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాలని, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే వంటి రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. దేశంలో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లుగా ఉందని, జీడీపీలో దీని వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. లాజిస్టిక్స్(Logistics) వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయం తగ్గి, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. తూర్పు తీరంలో ఉన్న ఏపీ, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ఎకో సిస్టమ్‌లో కీలకమైన ప్రాంతమని, దీనికోసం ఒక బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు.
పోర్ట్‌లు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రైల్వేలతో కూడిన మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి, వ్యయం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం స్పష్టం చేశారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని, పాత్ హోల్స్ లేకుండా రోడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఈ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

మౌలిక సదుపాయాలు, భవిష్యత్ లక్ష్యాలు
ప్రస్తుతం ఏపీలో 4,739 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, వీటిని విస్తరిస్తామని చెప్పారు. హైస్పీడ్ రైల్వే(High Speed Railway) కారిడార్‌కు కేంద్రం అంగీకరించిందని, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్లకు నాలుగు లైన్ల రైల్వే లైన్లు రాబోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 1053 కిలోమీటర్ల సముద్రతీరం ఏపీకి ఉందని, దీని ద్వారా 320 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. రామాయపట్నం పోర్టు ఏప్రిల్ 26వ తేదీకి, మచిలీపట్నం పోర్టు డిసెంబర్ 26వ తేదీకి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు.
ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆటోమొబైల్ రంగంలో కియా, ఇసుజు, హీరో మోటార్స్ వంటి సంస్థలు తమ హయాంలోనే ఏపీకి వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ ఎకానమీకి, ఎగుమతులను $450 బిలియన్లకు పెంచడం తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఎంత పెట్టుబడిని ఆకర్షించింది?
మొత్తం 125 ప్రాజెక్టుల్లో రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.
భారత్‌లో జీడీపీలో లాజిస్టిక్స్ వాటా ఎంత?
జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: